ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పొత్తులపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..! - Chandrababu Interesting Comments

Chandrababu Interesting Comments : రాజకీయాల్లో పొత్తులపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తులు సహజమని తెలిపారు. కానీ సమీకరణాలు మారుతుంటాయని చెప్పారు. ఎప్పుడేం చేయాలన్న దానిపై పార్టీలకు వ్యూహాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

chandrababu
chandrababu

By

Published : Jan 8, 2023, 5:47 PM IST

Chandrababu Interesting Comments: రాజకీయాల్లో పొత్తులపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో పొత్తులు సహజమని చెప్పారు. 2009లో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నామని గుర్తు చేశారు. 2014లో టీఆర్‌ఎస్‌తో విభేదించామని అన్నారు. రాజకీయాల్లో సమీకరణాలు మారుతుంటాయని పేర్కొన్నారు. పొత్తులపై ఇప్పుడు మాట్లాడటం సరికాదని వివరించారు. ఎప్పుడేం చేయాలన్న దానిపై పార్టీలకు వ్యూహాలు ఉంటాయని చంద్రబాబు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్​తో భేటీ అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అంతకుముందు ఇరువురి మధ్య దాదాపు రెండున్నర గంటల పాటు సమావేశం సాగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలు.. జీవో నంబర్‌-1పైన ఇరువురు నేతలు సుధీర్ఘంగా చర్చించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details