Chandrababu : ఇరుకు రోడ్లలో మీటింగ్‌లు పెట్టి డ్రోన్లతో షో చేస్తున్నారని సీఎం జగన్ చేసిన విమర్శలకు.. చంద్రబాబు ధీటుగా బదులిచ్చారు. సమావేశం జరుగుతున్న ప్రదేశానికి వచ్చి చూస్తే నిజనిజాలు తెలుస్తాయని నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలో నిర్వహించిన 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం'లో చంద్రబాబు మాట్లాడారు. ఇష్టమొచ్చినట్లు అవాకులు, చెవాకులు పేలితే.. తరిమికొడతామని హెచ్చరించారు. రాష్ట్ర బిడ్డల భవిష్యత్తుకు ఐటీ అనే ఆయుధాన్ని తనిస్తే, భస్మాసుర అస్త్రం సైకో సీఎం ఇస్తున్నాడని ఆరోపించారు. ఇంకా ఉపేక్షిస్తే పూర్తిగా నాశనం అవుతామని అన్నారు.
టీడీపీ అన్స్టాపబుల్ .. బుల్లెట్లా దూసుకెళ్తాం: చంద్రబాబు - cbn prime minister narendra modi
Chandrababu Comments on YS Jagan : చంద్రబాబు పర్యటనలో డ్రోన్ షో చేస్తున్నారని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు.. టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నిజానిజాలు మాట్లడాలని విమర్శలను తిప్పికొట్టారు.
ముఖ్యమంత్రి ప్రజలను బానిసల్లాగా చూస్తున్నాడని చంద్రబాబు ఆరోపించారు. నిత్యావసరల ధరలు, పన్నులు, ఇతర ఛార్జీలను సీఎం పెంచుతూనే ఉన్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అన్స్థాపబుల్ అని.. రాష్ట్ర భవిష్యత్తు కోసం బుల్లెట్లా దూసుకుపోతుందని చంద్రబాబు అన్నారు. 'ఆవు చేలో మేస్తే' సామెత వలే జగన్మోహన్ రెడ్డి దోపిడీకి తగ్గట్టే ఎమ్మెల్యేల అవినీతి ఉందని ఆయన ధ్వజమెత్తారు. కొత్తగా లే అవుట్లు వేయాలంటే ఎకరాకు రూ.10లక్షల చొప్పున వైసీపీ ఎమ్మెల్యేలు వసూళ్లు చేస్తున్నారని మండిపడ్డారు. రైతులు నష్టపోతే కనీసం వారివైపు చూడని మంత్రి.. జిల్లాలో ఉన్నాడని చంద్రబాబు ఆరోపించారు. తనపై అనవసరంగా నోరుపారేసుకునే ముందు రైతులకు మంత్రిగా ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు.
ఇవీ చదవండి: