CBN Comments On Startups: జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం, నిరాసక్తత వల్ల అంకుర సంస్థల ఏర్పాటు వ్యవస్థ ధ్వంసమైందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. లక్ష్యాలు, కలలు నెరవేర్చుకోవాలన్న ఎందరో పారిశ్రామికవేత్తల ఆకాంక్షలను ఇది దెబ్బతీసిందని మండిపడ్డారు. మారుతున్నతీరుతో మన రాష్ట్రం, యువత భవిష్యత్తు ఏంటో అనే బాధ ఎంతగానో వేధిస్తోందన్నారు. లక్ష్యాలు, కలలు నెరవేర్చుకోవాలన్న ఎందరో పారిశ్రామికవేత్తల ఆకాంక్షలను ఇది దెబ్బ తీసిందన్నారు. జగన్ తీరుతో రాష్ట్రంలో యువత భవిష్యత్తు ఏంటో అనే బాధ వేధిస్తోందని చెప్పారు.
2019 వరకు దేశంలోనే అత్యధికంగా అంకుర సంస్థలు కోరుకునే గమ్యస్థానాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో స్టార్టప్‌లు అభివృద్ధి చెందడానికి విశాఖలో అనుకూల వాతావరణ వ్యవస్థను నిర్మించినట్లు వివరించారు. అంకుర సంస్థల ఏర్పాటుకు ఎంతో కృషి చేసినట్లు చెప్పారు.