ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గేర్‌ మార్చాం.. స్పీడ్‌ పెంచాం.. టీడీపీ అన్​స్టాపబుల్​ : చంద్రబాబు

CBN : తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి జగన్​పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్కిల్​ డెవలప్​మెంట్​లో ఏం జరిగిందని ప్రశ్నించారు. షెల్​ కంపెనీలు పెట్టేది నువ్వు... వాటి వల్ల లాభపడేది నువ్వు. మేము అధారాలతో ఉన్నామని స్పష్టం చేశారు. జగన్‌పై అనేకమంది ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉందని అన్నారు. నమ్మకంగా ఉండే నేతలే జగన్‌ను వీడి వెళ్తున్నారని.. అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టాలని జగన్ చూశారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అధికార పార్టీ మరింత ఇబ్బందులకు గురి చేసినా ఎదుర్కోవాలని సూచించారు. తెలుగుదేశం అన్ స్టాపబుల్ అని.. సైకిల్ గేరు మార్చి స్పీడు పెంచిందని.. దూసుకెళ్తోందని.. అడ్డం వస్తే తొక్కుకుంటూ వెళ్తామని చంద్రబాబు హెచ్చరించారు.

Chandrababu Comments
చంద్రబాబు

By

Published : Mar 24, 2023, 9:26 PM IST

Chandrababu Comments : తెలుగుదేశం బలపడింది కాబట్టే జగన్ నవంబరులోనో, డిసెంబరులోనో ఎన్నికలకు వెళ్లొచ్చని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లినా దానిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులుకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన తెలుగుదేశం క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని స్పష్టం చేశారు. నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకోవాలని సూచించారు. అధికారంలోకి వచ్చాక సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా మంత్రిని నియమిస్తామని వెల్లడించారు.

గ్రామస్థాయిలో ఏ సమస్య ఉన్న పరిష్కరిస్తామని తెలిపారు. గ్రామాలలో నెలకొన్న సమస్యల జాబితాపై టీడీపీ కసరత్తు చేస్తోందని వెల్లడించారు. అన్ని తెలుసని భావిస్తే.. పతనం ఖాయమని.. తాను నిత్య విద్యార్థిని అని పేర్కొన్నారు. సంతలో పశువుల మాదిరిగా తెలుగుదేశం ఎమ్మెల్యేలను వైసీపీ కొనుగోలు చేసిందని మండిపడ్డారు. ఈ ఏడాది మరింత జాగ్రత్తగా ఉండాలని నాయకులకు సూచించారు. ఒక్కసారి అంటూ అధికారంలోకి వచ్చిన జగన్​కు.. ఇదే చివరిసారి కావాలని అన్నారు.

స్కిల్ డెవలప్​మెంట్​ స్కాం అంటూ తనపై చేస్తున్న ఆరోపణలకు టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. స్కిల్ డెవలప్​మెంటులో ఏదో జరిగిందని కొత్త రాగం తీస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్ని రాష్ట్రాల్లో స్కిల్ విషయంలో సీమెన్స్ ఒప్పందం జరిగిందో తెలుసా అని ప్రశ్నించారు. షెల్ కంపెనీలు పెట్టుకుంది జగన్, ఆయన భార్యేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తమిళనాడులో షెల్ కంపెనీలు పెట్టుకుంది ఎవరనీ ప్రశ్నించారు. స్కిల్ స్కాం జరిగిందని బ్యాంకు ఖాతాల్లోకి నగదు వెళ్లిందని ఆరోపిస్తున్నారన్న చంద్రబాబు.. ఎవరి ఖాతాల్లోకి నగదు వెళ్లిందో చెప్పు జగన్ రెడ్డి అని దుయ్యబట్టారు. డిజిటల్ కరెన్సీ వస్తే మోసాలు జరగవని ప్రధానికి చెప్పిన మొదటి వ్యక్తిని తనేనని గుర్తుచేశారు. అవినీతి ఉండకూడదని సలహాలు ఇచ్చానని, తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ తప్పు చేయదని తేల్చిచెప్పారు.

రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలనే ఆలోచనలో ఉండిపోయాను : వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టంచేశారు. కష్టపడ్డ కార్యకర్తలను వెతుక్కుంటూ.. పార్టీ వాళ్ల వద్దకే వస్తుందని, వచ్చే ప్రభుత్వంలో పైరవీలు ఉండవని తేల్చిచెప్పారు. కష్టపడిన కార్యకర్తలను ఎమ్మెల్యేలు గుర్తించకున్నా పార్టీ గుర్తిస్తుందన్నారు. పార్టీ కోసం పని చేసే వారే తన ఆప్తులని, వారికే ప్రాధాన్యతని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రాన్ని బాగుచేయడం ఎంత ముఖ్యమో, తెలుగుదేశం కుటుంబ సభ్యులను బాగుచేయడం అంతే ముఖ్యమని ఉద్ఘాటించారు. అధికారం వస్తే మమ్మల్ని పట్టించుకోరనే అనుమానం కొందరిలో ఉందన్న చంద్రబాబు.. గతంలో తను కార్యకర్తలను ఎక్కువ సమయం ఇవ్వలేకపోయిన మాట వాస్తవమన్నారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉండిపోయానన్నారు. ఈసారి కార్యకర్తలకే పెద్ద పీట వేస్తామని, ఎన్ని పనులున్నా కార్యకర్తలే ముఖ్యమన్నారు.

టీడీపీది జన బలం : ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ గాల్లో పల్టీలు కొట్టారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఎంతో కసరత్తు చేసినా చివరికి బోర్లా పడ్డారని దుయ్యబట్టారు. జగన్‌పై అనేకమంది ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉందని అన్నారు. నమ్మకంగా ఉండే నేతలే జగన్‌ను వీడి వెళ్తున్నారని.. అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టాలని జగన్ చూశారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అధికార పార్టీ మరింత ఇబ్బందులకు గురి చేస్తోన్న ఎదుర్కోవాలని సూచించారు. బాబాయ్‌ హత్య కేసులో డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. అంతకుముందు కోడికత్తి డ్రామాలు ఆడారని తెలిపారు. ఈ డ్రామా పేరుతో ఓట్లు వేయించుకున్నారని దుయ్యబట్టారు. వైసీపీది ధన బలమని.. టీడీపీది జన బలమని అన్నారు.

పోలవరం పూర్తి అయ్యేది : ప్రజావేదికను కూలగొట్టిన రోజే జగన్ వైఖరేంటో అర్థమైందని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు జగన్ అని దుయ్యబట్టారు. జగన్ చేసిన అవమానాలను రాష్ట్ర ప్రజలు భరిస్తున్నారని, తమ తిక్కల ముఖ్యమంత్రి రాజధాని పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నారని చెప్పుకోవాల్సి వస్తోందని చంద్రబాబు ఆరోపించారు. ప్రతి ఎకరాకు నీళ్లిచ్చి సస్యశ్యామలం చేశామని ఆక్షేపించారు. 2019 ఎన్నికల్లో అధికార మార్పిడి జరిగిందని, ఆంధ్రకి శని పట్టిందని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక పోలవరం ఆగిపోయిందని, పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పోలవరం ప్రాజెక్టు అయితే బ్యారేజ్ కడతానని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ ఎమ్మెల్యేలకు జగన్​పై నమ్మకం పోయింది : వైసీపీ ఎమ్మెల్యేలకు జగన్‌పై నమ్మకం పోయిందని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు నలుగురు మాత్రమే అసంతృప్తి వ్యక్తం చేశారని.. బయటకు చెప్పలేని వాళ్లు చాలామంది ఉన్నారన్నారు. ఇకపై తెలుగుదేశం అన్ స్టాపబుల్ అని చంద్రబాబు స్పష్టం చేశారు. సైకిల్ గేరు మార్చి స్పీడు పెంచిందని.. దూసుకెళ్తోందని.. అడ్డం వస్తే తొక్కుకుంటూ వెళ్తామని హెచ్చరించారు. వైసీపీ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ మీద నమ్మకం లేదని దుయ్యబట్టారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టుగా అనురాధ గెలిచిందని ఆక్షేపించారు. నాగరిక సమాజంలో ఆడబిడ్డలను ఎవ్వరూ వేధించరని చంద్రబాబు గుర్తుచేశారు. కానీ అనురాధను వైసీపీ నేతలు వేధించారని వాపోయారు. తెలుగుదేశం మరిన్ని విజయాలు సాధించాలని దానికి సైన్యం కావాలని .. ఆ సైన్యం కార్యకర్తలేనని చంద్రబాబు తేల్చిచెప్పారు. జగన్ చేసిన విధ్వంసం వల్ల 30 ఏళ్లు వెనక్కు వెళ్లామని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులు చేయడం, రాష్ట్రాన్ని దోచుకోవడం ఇదే జగన్ పని అని దుయ్యబట్టారు.

చంద్రబాబు టీడీపీ అధినేత

"స్కిల్​ డెవలప్​మెంట్​లో ఏం జరిగింది. 370 కోట్ల రూపాయలు విడుదల చేసి.. కేబినెట్​ అమోదం ఇచ్చి సజావుగా అమలు చేశాము. షెల్​ కంపెనీలు పెట్టేది నువ్వు. వాటి వల్ల లాభపడేది నువ్వు. మేము అధారాలతో ఉన్నాము. హవాలా మంత్రి ఉన్నది మీదగ్గర. ఇంకా ఒక సంవత్సరమే మిగిలి ఉన్నది మనకు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలి. ఈ జగన్​మోహన్​ రెడ్డి అలోచిస్తా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ బలపడుతోంది కాబట్టి నవంబర్​లోనో, డిసెంబర్​లోనో ఎన్నికలు పెట్టాలని అనుకుంటున్నాడు." -చంద్రబాబు, టీడీపీ అధినేత

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details