ABSENT: ఎన్టీఆర్ జిల్లా నందిగామ నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశానికి ఛైర్‌పర్సన్ సహా వైకాపా కౌన్సిలర్లు, కో- ఆప్షన్ సభ్యులు గైర్హాజరు కావడంతో వాయిదా పడింది. వైకాపా కౌన్సిలర్ల గైర్హాజరుపై తెదేపా, జనసేన కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాయిదా వేసి వెళ్లిపోతున్న కమిషనర్ జయరామ్‌ను అడ్డుకుని సమావేశం జరిపించాలంటూ నిలదీశారు. ఏది ఏమైనా కమిషనర్ సమావేశం నిర్వహించి తీరాలని డిమాండ్ చేశారు. అయినా కమిషనర్ వెళ్లిపోవడంతో.. ఛాంబర్ ఎదుట తెదేపా కౌన్సిలర్లు ఆందోళన చేపట్టారు.
నందిగామ నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశం వాయిదా.. ఎందుకంటే? - ఎన్టీఆర్ జిల్లా తాజా వార్తలు
ABSENT: నందిగామ నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశానికి ఛైర్‌పర్సన్ సహా వైకాపా కౌన్సిలర్లు, కో- ఆప్షన్ సభ్యులు గైర్హాజరయ్యారు. దీంతో కమిషనర్ జయరామ్ సమావేశాన్ని వాయిదా వేశారు. వైకాపా కౌన్సిలర్ల గైర్హాజరుపై.. తెదేపా, జనసేన కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైకాపా కౌన్సిలర్ల గైర్హాజరుతో తెలుగుదేశం సభ్యులు పాలకపక్షం వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మూడు నెలలుగా కౌన్సిల్ సమావేశం జరగకపోగా.. తిరిగి సమావేశాన్ని పెట్టి వాయిదా వేయటం ఏంటని ప్రశ్నించారు. సమావేశం నిర్వహించి ప్రజాసమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ఏకపక్ష వైఖరి వల్ల చివరికి సొంత పార్టీ కౌన్సిలర్లు సమావేశానికి రాకుండా మొహం చాటేశారని తెలుగుదేశం కౌన్సిలర్లు ఆరోపించారు. కమిషనర్ ఏకపక్ష నిర్ణయాల వల్ల కౌన్సిలర్లకు విలువ లేకుండా పోతోందని మండిపడ్డారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: