Central Team Visit Tomorrow Cyclone Affected Areas: రాష్ట్రంలో తాజాగా మిగ్‌జాం తుపాను బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. మూడు రోజులపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ క్రమంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బుధవారం కేంద్ర బృందం పర్యటించనుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. బుధవారం కృష్ణా, బాపట్ల జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటించనుందని ఆయన పేర్కొన్నారు. గురువారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పర్యటించి, క్షేత్రస్థాయిలో జరిగిన నష్టాన్ని అంచనా వేయనున్నారని వెల్లడించారు.
BR. Ambedkar comments: ''మిగ్‌జాం తుపాను ప్రభావిత జిల్లాల్లో జరిగిన పంట, ఇతర ఆస్తుల నష్టాన్ని అంచనా వేసేందుకు బుధవారం కేంద్ర బృందం రాష్ట్రానికి రానుంది. బుధవారం కృష్ణా, బాపట్ల జిల్లాల్లో, గురువారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పర్యటించనుంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేంద్ర రత్నూ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన ఈ బృందం రాష్ట్రంలో పర్యటించనుంది. రెండు రోజులపాటు క్షేత్రస్థాయిలో జరిగిన నష్టాన్ని అంచనా వేసి, నివేదికను సమర్పించనుంది'' అని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేద్కర్ అన్నారు.
రైతులకు చేదు మిగిల్చిన మిగ్‌జాం తుపాను-తడిసిన ధాన్యం కొనుగోలుకు ఆసక్తి చూపని మిల్లర్లు
Central Team Meeting at Ananta Collectorate:అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లో కేంద్రం బృందం సమావేశం జరిగింది. సమావేశంలో వివిధ శాఖల అధికారులతో కేంద్ర బృందం చర్చలు జరిపింది. ఈ క్రమంలో కరవుతో పంట నష్టపోయిన తీరును కలెక్టర్ గౌతమి బృందానికి వివరించారు. అనంతరం జిల్లాలో రూ.251 కోట్లు పంట నష్టం అంచనాలతో కూడిన నివేదికలను వారికి అందజేశారు.