ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓటర్ల జాబితాలో అక్రమాలపై సీఈసీ బృందం సమీక్ష - ఏం చర్యలు తీసుకున్నారని కలెక్టర్లకు ప్రశ్న

Central Election Commission Team Meeting in Andhra: రానున్న ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల బృందం నిర్వహిస్తున్న సమీక్ష సమావేశం రెండో రోజు కొనసాగుతోంది. ఇందులో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం బృందం అధికారులు ఎనిమిది జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులతో సమావేశమయ్యారు.

entral_election_commission_team_meeting_in_andhra
entral_election_commission_team_meeting_in_andhra

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 23, 2023, 2:52 PM IST

Central Election Commission Team Meeting in Andhra: రాష్ట్రంలో ఓటర్ల జాబితా, పోలింగ్‌ సన్నద్ధత, ఇతర అంశాలపై విజయవాడలో రెండో రోజూ కేంద్ర ఎన్నికల బృందం సమీక్ష చేస్తోంది. తొలిరోజు 18 జిల్లాల సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల బృందం శనివారం 8 జిల్లాల అధికారులతో చర్చలు జరుపుతోంది. విజయవాడలోని ఓ హోటల్​లో నిర్వహిస్తున్న సమీక్ష సమావేశానికి రాష్ట్ర ఎన్నికల అధికారులు, ఎస్పీలు, కలెక్టర్లు హాజరయ్యారు.

పోలింగ్‌ సన్నద్ధతలో భాగంగా సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో భద్రత, చెక్‌ పోస్టులు, తనిఖీ కేంద్రాల ఏర్పాటుపై సీఈసీ బృందం ఆరా తీస్తోంది. ఓటర్ల జాబితాలో ఎక్కువగా అవకతవకలు ఉన్న జిల్లాలపై నిరంతరం పర్యవేక్షణ పెట్టాలని సీఈవోకు కేంద్ర బృందం సూచనలు చేసినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, వివిధ శాఖల ఉన్నతాధికారులతో కేంద్ర ఎన్నికల బృందం భేటీ కానుంది.

ఏపీలో ఎన్నికల నిర్వహణ - సన్నద్ధతపై ఈసీ సమీక్ష-ఎన్నికలకు 4 నెలలే సమయముందని వెల్లడి

శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2024, ఎన్నికల కోసం సన్నద్ధత వంటి అంశాలపై విజయవాడ సీఈసీ సంఘం ప్రతినిధుల బృందం స‌మీక్షా స‌మావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశాలు రెండు రోజులు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో తొలి రోజైన శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహించారు. రెండో రోజు సమావేశం శనివారం జరుగుతోంది.

సీనియర్‌ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు, డిప్యూటీ ఎన్నికల కమిషనర్ల వంటి స్థాయి అధికారులు ఈ సమావేశంలో శుక్రవారం పాల్గొన్నారు. గత రెండు సార్వత్రిక ఎన్నికల సమయాల్లో ఏ ప్రాంతాల్లో ఘర్షణలు, అల్లర్లు, విధ్వంసాలు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని ఆరా తీశారు. వాటిపై నమోదు చేసిన కేసుల పరిస్థితి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

పార్టీ ముఖ్యనేతలతో జనసేనాని సమావేశం - ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక, పోటీ స్థానాలపై చర్చలు

Central Election Commission Team Visit in AP :ఎన్నికల సమయాల్లో సమస్యాత్మకమైన ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లోని పోలింగ్​ కేంద్రాల్లో రానున్న ఎన్నికల కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారని సీఈసీ బృంద శుక్రవారం వివరాలు సేకరించింది. గతంలో రీ పోలింగ్ ​ నిర్వహించిన కేంద్రాల ఆంశాన్ని సైతం అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని పలు రాజకీయ పార్టీలు ఓటర్ల జాబితాపై ఇచ్చిన ఫిర్యాదులపై ఆరా తీశారు.

ఓటరు జాబితా ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించారా, ఏం తేల్చారని అధికారులను కేంద్ర ఎన్నికల సంఘ బృందం ప్రశ్నించింది. వాటిలో వాస్తవమెంత అని జిల్లాల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు దాఖలుచేసిన ఫారం 7 దరఖాస్తులపై ఆరా తీశారు. దరఖాస్తుదారులపై ఏం చర్యలు తీసుకున్నారని ఆ జిల్లా కలెక్టర్‌ను ప్రశ్నించగా.. బాధ్యులందరిపై కేసులు నమోదు చేసినట్లు కేందర్ ఎన్నికల బృందానికి ఆయన తెలిపారు.

ఓటర్ల జాబితా అవకతవకలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి- తొలిరోజు సమీక్షలో అధికారులతో సుదీర్ఘ చర్చ

ABOUT THE AUTHOR

...view details