Centenary Celebrations at Hyderabad Public School: తెలంగాణలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా జరుగుతున్న ఇండియా సైన్స్ ఫెస్టివల్ మొదటి రోజు సందర్శకులు భారీగా హాజరయ్యారు. కార్యక్రమంలో వైజ్ఞానిక చర్చలు, హ్యాండ్-ఆన్ వర్క్‌షాప్‌లు, పాలనా విధానాలపై రౌండ్ టేబుల్ సమాలోచనలు, పుస్తకావిష్కరణలతోపాటు సినిమాలు ప్రదర్శించారు. కళాశాల విద్యార్థుల కోసం పీహెచ్‌డీ ప్రోగ్రామ్ బూత్స్ ఏర్పాటు చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా పలు పాఠశాలలు, కళాశాలల నుంచి పెద్దఎత్తున విద్యార్థులు ఈ వైజ్ఞానికోత్సవాన్ని సందర్శిస్తున్నారు. సైన్స్ ఎక్స్‌పోలో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంశాలపై ఏర్పాటుచేసిన ప్రాజెక్టులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. కెమిస్ట్రీలో సబ్లిమేషన్ అన్న అంశాన్ని చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు అందరికీ అర్థం అయ్యే రీతిలో ఎక్స్‌పరిమెంట్లు చేస్తూ, ఇద్దరు విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాల్ అందరినీ ఆకట్టుకుంది.
Centenary Celebrations of Hyderabad Public School Ended: సైన్స్ ఫెస్ట్‌తో పాటు ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లలో విద్యార్థులకు ఆసక్తి కలిగించేలా రోబోటిక్స్, కృత్రిమ మేధాపై పలు ప్యానల్ డిస్కషన్లు కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. కారులో ఇంజిన్ పని తీరును, దానిని ఇంకా మెరుగు పరిచే ప్రయత్నాన్ని వివరిస్తూ ముగ్గురు విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాల్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంవత్సరం అంతా కొనసాగనున్న ఈ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన ఇండియన్ సైన్స్ ఎక్స్పో మూడవ రోజు కూడా ఘనంగా సాగింది.
ఆఖరి రోజు కావడంతో విద్యార్థుల నుంచి తల్లిదండ్రుల వరకు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించేందుకు తల్లిదండ్రులు తరలి వచ్చారు. సైన్స్ ఎక్స్‌పోలో తమ పిల్లలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో మూడు రోజులు పాటు ఘనంగా సాగిన సైన్స్ ఎక్స్పో ఆఖరి రోజు విజయవంతంగా పూర్తి అయ్యింది. వివిధ జిల్లాల నుంచి కూడా విద్యార్థులు వచ్చి సైన్స్ ఎక్స్‌పోలో పాల్గొన్నారు.
అట్టహాసంగా ముగిసిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది ఉత్సవాలు ఇవీ చదవండి: