Condolence to PM Modi Mother: ప్రధాని మోదీ మాతృమూర్తి హీరాబెన్ మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
- భరతమాత ముద్దుబిడ్డను అందించిన మాతృమూర్తి హీరాబెన్.. ప్రధానికి భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని వేడుకుంటున్నాను. - గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్
- ప్రధాని మోదీకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ కఠిన సమయంలో వారి కుటుంబం గురించి ప్రార్థిస్తున్నాను - ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి
- తల్లిని కోల్పోతే ఆ బాధ ఎంత కఠినంగా ఉంటుందో అర్ధం చేసుకోగలను. ఈ విషాద సమయంలో నా ప్రార్ధనలు వారికి ఉంటాయి. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. - టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
-
ప్రధాని మోదీ మాతృమూర్తి హీరాబెన్‌కి స్వర్గగతులు ప్రాప్తించాలని భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నాను. తల్లి లేని లోటు తీర్చలేనిది..ఎవరూ పూడ్చలేనిది. -
జనసేన అధినేత పవన్ కల్యాణ్
-
విశ్వం మెచ్చిన ధీరోదాత్తమైన నాయకుడికి జన్మనిచ్చిన తల్లిగా హీరాబెన్ ప్రస్థానం చిరస్మరణీయం. ప్రధాని మోదీకీ ఆత్మస్థైర్యం ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. -
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు