ఎన్నికల నగారా మోగే నాటికే సమగ్ర ప్రణాళికతో సిద్ధంగా ఉండాలి : సీఈసీ బృందం CEC Team Review Meeting in Andhra Pradesh: ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, నిష్పక్షపాతం, జవాబుదారీతనమే కీలకమని కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధి బృందం స్పష్టం చేసింది. సాధారణ ఎన్నికల నిర్వహణకు సమగ్ర ప్రణాళిక ముఖ్యమని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఓటర్ల జాబితాలో కనీసం ఒక్క దోషం కూడా లేకుండా చూడగలిగితే వివాదరహితంగా ఎన్నికలు పూర్తవుతాయని స్పష్టం చేసింది.
పోలింగ్ శాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక "స్వీప్" కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. విజయవాడలో రెండు రోజులపాటు కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధి బృందం సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.
ఓటర్ల జాబితా అవకతవకలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి- తొలిరోజు సమీక్షలో అధికారులతో సుదీర్ఘ చర్చ
CEC Team Meeting In Vijayawada: రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగే నాటికే సమగ్ర ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని, అధికార యంత్రాంగానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధుల బృందం సూచనలు చేసింది. దీనివల్ల ఎలాంటి గందరగోళానికి తావులేకుండా శాంతియుత వాతావరణంలో సజావుగా ఎన్నికల నిర్వహించవచ్చని తెలిపింది. విజయవాడలో గత శుక్ర, శనివారాల్లో కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, ఎస్పీలతో ప్రతినిధుల బృందం సమీక్షించింది.
Election Commission Official Meeting in AP: ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ 2024, సాధారణ ఎన్నికల సన్నద్ధత కార్యకలాపాలపై చర్చలు జరిపింది. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు, అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తి చాటేలా నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సూచించారు. ఎన్నికల సన్నద్ధత, నిర్వహణలో ప్రతి దశలోనూ అప్రమత్తత అవసరమని.. పారదర్శకత, జవాబుదారీతనం ముఖ్యమని కేంద్ర ఎన్నికల సంఘం బృందంలోని అధికారులు స్పష్టం చేశారు.
ఏపీలో ప్రారంభమైన ఎన్నికల హడావిడి - అధికారుల బదిలీలు, పోస్టింగులపై ఈసీ మార్గదర్శకాలు
EC Meeting on 2024 Elections Arrangements in AP: ఎన్నికల నిర్వహణలో తప్పుల్లేని ఓటర్ల జాబితానే కీలకమని ఈసీ బృందం అధికారులకు స్పష్టం చేసింది. ఓటర్ జాబితాలో మరణించిన వారి పేర్లు తొలగింపు సహా, రెండు ఓట్లు నమోదు వంటివి లేకుండా చూడాలని ఆదేశించారు.
రాజకీయ పార్టీల ఫిర్యాదులను క్షుణ్నంగా పరిశీలించి, పారదర్శకంగా పరిష్కరించాలని సూచించారు. ఎన్నికల సిబ్బందికి పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వాలన్నారు. గత ఎన్నికల్లో నియోజకవర్గాలు, పోలింగ్ స్టేషన్ల వారీగా పోలింగ్ శాతాలను విశ్లేషించుకుని, అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర అధికారులకు సూచించారు.
ఓటర్ల జాబితాలో అక్రమాలపై సీఈసీ బృందం సమీక్ష - చర్యలేం తీసుకున్నారని కలెక్టర్లకు ప్రశ్న