CBI Officials Press Release: విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసిన విద్యార్థులు.. నకిలీ రిజిస్ట్రేషన్లు పొందారనే సమాచారం మేరకు సీబీఐ దేశవ్యాప్తంగా తనిఖీలు చేపట్టింది. ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ పరీక్షల్లో ఫెయిల్ అయిన 73 మంది నకిలీ రిజిస్ట్రేషన్లు పొందారని సీబీఐ అధికారులు ప్రాధమికంగా గుర్తించారు. దీనిలో భాగంగానే విజయవాడలోని ఏపీ మెడికల్ కౌన్సిల్లో ఈ నెల 23న తనిఖీలు చేపట్టారు. పలు రిజిస్టర్ పుస్తకాలు, అప్లికేషన్లు, కంప్యూటర్లోని డేటాను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 12 గంటల పాటు సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీలపై సీబీఐ అధికారులు తాజాగా పత్రికా ప్రకటన విడుదల చేసారు.
ఏపీ మెడికల్ కౌన్సిల్లో తనిఖీలు.. వివరాలు వెల్లడించిన సీబీఐ - press note inspections in the AP Medical Council
CBI Officials Press Release: ఇతర దేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసిన వారు.. నకిలీ రిజిస్ట్రేషన్లు పొందారనే సమాచారంతో దేశ వ్యాప్తంగా సీబీఐ తనిఖీలు నిర్వహించింది. దీనిలో భాగంగా విజయవాడలోని ఏపీ మెడికల్ కౌన్సిల్లో ఈ నెల 23న తనిఖీలు చేశారు. తాజాగా తనిఖీలపై సీబీఐ అధికారులు పత్రికా ప్రకటన విడుదల చేశారు.
సీబీఐ