ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డుపై కారు బోల్తా.. బయటపడ్డ మద్యం బాటిళ్లు.. తీరా చూస్తే..! - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

Accident: కారు రయ్​మంటూ దూసుకుపోతోంది. తిరువూరు శివారులో అదుపుతప్పి బోల్తాపడింది. అంతే కారులో ఉన్న మద్యం బాటిళ్లన్నీ రోడ్డుపై పడ్డాయి. ఇది చూసి కారు డ్రైవర్​ వెంటనే అక్కడినుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడకు వచ్చి ఆ సీన్​ చూసి షాక్​ తిన్నారు. ఇంతకు విషయం ఏంటంటే..

మద్యం తరలిస్తున్న కారు బోల్తా
మద్యం తరలిస్తున్న కారు బోల్తా

By

Published : Sep 5, 2022, 10:43 PM IST

Updated : Sep 5, 2022, 10:57 PM IST

రోడ్డుపై కారు బోల్తా.. బయటపడ్డ మద్యం బాటిళ్లు.. తీరా చూస్తే..

Illegal Liquor Transportation: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు శివారులో కారు బోల్తా పడింది. కారులో ఉన్న మద్యం బాటిళ్లు రోడ్డుపై పడ్డాయి. దీంతో ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది. అప్రమత్తమైన కారు డ్రైవర్​ పరారయ్యాడు. ప్రమాద విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు షాక్​ తగిలినంత పనైంది. ఆ మద్యం బాటిళ్లన్నీ తెలంగాణ నుంచి రాష్ట్రానికి అక్రమంగా సరఫరా చేస్తున్నట్లు బయటపడింది. మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Sep 5, 2022, 10:57 PM IST

ABOUT THE AUTHOR

...view details