CAG Statistics on State Revenue Deficit :అభివృద్ధి ఉంటే రాబడి ఉంటుంది. ప్రజలకు ఆదాయాలు ఉంటే కొనుగోళ్లు ఉంటాయి. ఆ మేరకు పన్నులు వసూళ్లు అవుతాయి. ఒక వైపు రాష్ట్ర స్థూల ఉత్పత్తి (State Gross Product)పై గొప్పలు వల్లిస్తున్న వైఎస్సార్సీపీ (YSRCP Government) పాలనలో రాబడి కనిపించడం లేదు. ప్రభుత్వం అంచనా వేసుకున్నంత కూడా పన్నుల వసూళ్లు లేవు. రెవెన్యూ వసూళ్లూ అంతంతే. అదే సమయంలో అప్పులు మాత్రం రెట్టింపు చేస్తున్నారు. రెవెన్యూ లోటు లెక్కకు మించి పెరిగిపోతోంది.
AP Debts 2023: అప్పు చేయడంలో తగ్గేదేలే!.. అంటున్న జగన్ సర్కార్
Revenue Deficit Increasing in Andhra Pradesh :రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి ఏడు నెలల కాలానికి రాష్ట్ర ఆర్థిక స్వరూప గణాంకాలను కాగ్ (CAG) వెల్లడించింది. రాష్ట్ర ఆర్థికశాఖ సమర్పించిన లెక్కలనే కాగ్ వెల్లడిస్తూ ఉంటుంది. అక్టోబరు నెలాఖరు వరకు ఉన్న పరిస్థితిని కాగ్ గణాంకాలు వెల్లడించాయి. ఏటా ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే రాష్ట్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ అంచనాలను చట్ట సభల్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందుతారు. ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు చేయాలి, ఎంతఅప్పు తీసుకురావాలి వంటి అంశాలను అందులో పొందుపరుస్తారు. అలా ఏడాది మొత్తానికి వేసిన అంచనాల్లో తొలి ఏడు నెలల కాలానికి సుమారు 60 శాతం సాధిస్తే అంచనాలకు తగ్గట్టుగా రాష్ట్ర ఆర్థిక నిర్వహణ సాగుతున్నట్లు లెక్క. అయితే అక్టోబరు నెలాఖరు వరకు పన్నుల రాబడి, రెవెన్యూ రాబడి కూడా ప్రభుత్వం ఆశించిన మేర లేవు.