Bonda Uma Maheshwar Rao: వివేకానంద రెడ్డి హత్య కేసుపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానం ఏంటని.. తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా మహేశ్వరరావు ప్రశ్నించారు. 43 నెలలు గడుస్తున్నా హత్య కేసులో సూత్రధారులు, పాత్రధారులను అరెస్ట్ చేయడంలో ఎందుకు వైకాపా ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో అన్ని వేళ్లు తాడేపల్లి వైపు చూపిస్తున్నాయని అన్నారు. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలతో జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో తలదించుకుని రాజీనామా చేయాలని బోండా ఉమా డిమాండ్ చేశారు.
వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రభుత్వ విధానం ఏంటి?: బొండా ఉమ - bonda uma on vivekananda reddy murder case
Bonda Uma on Viveka Murder Case: వివేకానంద రెడ్డి హత్య కేసుపై తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమ స్పందించారు. దీనిపై ప్రభుత్వ విధానం ఏంటని ప్రశ్నించారు. అన్న ప్రభుత్వంలో న్యాయం జరగటం లేదని సొంత చెల్లెలే అంటోందని అన్నారు.
వివేకానంద హత్య కేసులో ప్రధాన అనుమానితుడు ఎంపీ అవినాష్ రెడ్డి అని సీబీఐ చెబుతుంటే.. ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదన్నారు. సొంత చెల్లెలే.. అన్న ప్రభుత్వంలో న్యాయం జరగడం లేదని చెప్తోందని విమర్శించారు. కోడి కత్తి డ్రామా బయట పడుతుందని వారి తల్లిదండ్రులను ఇంటికి పిలిపించుకుని మాట్లాడుతున్నారని అన్నారు. జగన్ వ్యూహరచనతో రాజకీయ లబ్ధి కోసం జరిగిందే కోడి కత్తి డ్రామా.. అలాగే రాజకీయ లబ్ధి కోసం చేసినటువంటి హత్యలు, నిజనిజాలు త్వరలోనే తేలుతాయని బోండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి: