ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Bonda Uma: కేంద్రాన్ని ఎలాగైనా ఒప్పించే సత్తా జగన్ కు ఉంది: బొండా ఉమ

Bonda Uma: ముందస్తు ఎన్నికలకు సీఎం జగన్ సిద్దమవుతున్నాడని.. తెదేపా నేత బొండా ఉమ ఆరోపించారు. వచ్చే ఏడాదిలోనే ఎన్నికలు జరిపే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. వివేకా హత్య కేసు విచారణ తీరును జగన్‌ సొంత చెల్లే తప్పు పడుతున్నారని తెలిపారు. చంద్రబాబు కష్టపడి తెచ్చిన పరిశ్రమలు జగన్ అవినీతి దెబ్బకు పారిపోతున్నాయని బొండా ఉమ విమర్శించారు.

Bonda Uma
టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు బొండా

By

Published : Oct 22, 2022, 1:00 PM IST

Bonda Uma accused: ముందస్తు ఎన్నికలకు అనుమతివ్వాలని జగన్ దిల్లీ పెద్దలను కోరుతున్నారని, డిసెంబరులోనే జగన్ అసెంబ్లీని రద్దు చేసే పరిస్థితి ఉందని.. తెదేపా నేత బొండా ఉమ ఆరోపించారు. వచ్చే ఏడాది మే నెలలో ఎన్నికలు జరుపుకునే అవకాశం కల్పించాలని దిల్లీ పెద్దలను జగన్ కోరుతోన్నట్లు సమాచారం ఉందని తెలిపారు. ముందస్తు ఎన్నికలు పెట్టేందుకు కేంద్రం ఒప్పుకోకున్నా, కాళ్లు పట్టుకునైనా ఒప్పించే సత్తా జగన్ కు ఉందని.. ఉమ వ్యాఖ్యానించారు. వివేకా హత్య కేసు విచారణ జరుగుతున్న తీరును జగన్‌ సొంత చెల్లి షర్మిల తప్పు పడుతున్నారని తెలిపారు. సొంత కుటుంబానికే అన్యాయం చేసిన జగన్, రాష్ట్ర ప్రజలకేం చేస్తారని ప్రశ్నించారు. జగన్ కు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

పాలన కొనసాగించే ఆర్థిక పరిస్థితి జగన్ ప్రభుత్వంలో లేదని మండిపడ్డారు. పథకాలకే కాదు ఉద్యోగులకు జీతాలూ ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్రం ఉందని ఎద్దెవా చేశారు. పీకల్లోతు అప్పుల్లో కూరుకున్న రాష్ట్రాన్ని నడిపే పరిస్థితి జగన్ వైపు నుంచి కనిపించడం లేదని ధ్వజమెత్తారు. తన మీదున్న సీబీఐ, ఈడీ కేసుల రాజీ కోసం దిల్లీ పెద్దల కాళ్లు పట్టుకుంటున్నారని దుయ్యబట్టారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం.. ఏకంగా సీబీఐపైనే జగన్ దాడులు చేస్తున్నారని ఆరోపించారు.

టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు బొండా

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details