ఒక జాబ్ ఉంటే ఇయ్యమ్మా.. మెట్రో రైల్లో నిరుద్యోగుల భిక్షాటన - మెట్రోలో నిరుద్యోగులు
BJP Leaders Begging In Hyderabad Metro: టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణలో నిరుద్యోగం పెరిగిపోయిందంటూ బీజేపీ నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. పార్టీ నాయకుడు విజిత్ వర్మ ఆధ్వర్యంలో పలువురు కార్యకర్తలు.. యువ గ్రాడ్యుయేట్ల వేషాధారణలో హైదరాబాద్ మెట్రో రైల్లో భిక్షాటన చేశారు. నిరుద్యోగులను భిక్షాటన చేసే పరిస్థితికి సీఎం కేసీఆర్ తీసుకువచ్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏం జరుగుతోందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని వారు కోరారు.
మెట్రో రైల్లో నిరుద్యోగుల భిక్షాటన