Somu Veerraju విశాఖ భూముల వ్యవహారంలో సీబీఐతో విచారణ చేయించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సీఎం జగన్‌కు బహిరంగ లేఖ రాశారు. రెండు దశాబ్దాలుగా విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రభుత్వ భూములు దురాక్రమణకు గురయ్యాయని లేఖలో ఆరోపించారు. 2004లో అప్పటి సీఎం వైఎస్సార్ హయాంలో భూదందా మొదలైందని లేఖలో ప్రస్తావించారు. 2014 నుంచి 2019 వరకు భూకబ్జాలు జరిగాయని విపక్షంలో ఉన్నప్పుడూ సీఎం జగన్ ఆరోపించినట్లు లేఖలో గుర్తుచేశారు. 2019 నుంచి ఇప్పటివరకు ప్రభుత్వంలోనూ అక్రమ భూ కేటాయింపులు, అవకతవకలు, చట్ట వ్యతిరేక లావాదేవీలు జరిగాయని ఆరోపించారు. ఈ విషయంలో చిత్తశుద్ధి నిరూపించుకునేందుకు మొత్తం వ్యవహారాలను సీబీఐ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
విశాఖలో భూదురాక్రమణలపై సీబీఐతో విచారణ చేపట్టాలి: బీజేపీ - నేటి తెలుగు వార్తలు
Somu Comments: విశాఖలో భూముల దురాక్రమణపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. ఇప్పటివరకు జరిగిన భూకబ్జాలపై సీబీఐ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి.. ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని లేఖలో పేర్కొన్నారు.
ప్రభుత్వ భూములు, దేవదాయశాఖ భూములతోపాటు స్వాతంత్య్ర సమరయోధులకు కేటాయించిన భూముల్ని గద్దల్లా తన్నుకుపోతున్నా కబ్జాదార్లను ఎందుకు వదిలేస్తున్నారని ప్రశ్నించారు. మాజీ సైనికాధికారులను, సామాన్యులను బెదిరింపులకు గురి చేస్తూ అక్రమించుకుంటున్నారని.. వక్రమార్గంలో ఈ అక్రమించుకున్న భూములకు ఎన్వోసీ పొందుతున్నారనే ఆరోపణలను లేఖలో పేర్కొన్నారు. కబ్జాదారులకు ప్రభుత్వం మద్దతు ఇస్తోందనే భావన ప్రజల్లో కలగకూడదంటే ఈ దందాలకు చెక్ పెట్టి ప్రభుత్వ భూములను కాపాడాలని లేఖలో డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వం భూ కబ్జాలపై విచారణకు సిట్ వేసి విచారణ చేపట్టిందని.. కానీ నివేదిక బహిర్గతం కాకముందే ఎన్నికలు వచ్చాయని పేర్కొన్నారు. టీడీపీ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ విచారణ నివేదికను ఎందుకు బహిర్గతం చేయలేదని ప్రశ్నించారు. భూ అక్రమాలపై సీబీఐ విచారణను చేపట్టకపోతే బీజేపీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు.
ఇవీ చదవండి: