BJP Protest in Vijayawada: పాకిస్ధాన్ మంత్రి బిలావల్ బుట్టో వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా భాజపా శ్రేణులు నిరసనలు చేపట్టారు. విజయవాడ భాజపా కార్యాలయం నుంచి లెనిన్ సెంటర్ వరకు సోము వీర్రాజు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన కొనసాగింది. పాకిస్ధాన్ మంత్రి బిలావల్ బుట్టో న్యూయార్క్ లో దేశ ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలను సోమువీర్రాజు తీవ్రంగా ఖండించారు. బిన్ లాడెన్ చనిపోయినా ఇంకా ఆ వ్యక్తి బ్రతికే ఉన్నాడన్న బుట్టో వ్యాఖ్యలను దేశం హర్షించదని ఆయన పేర్కొన్నారు. పాకిస్ధాన్ కు చెందిన నేతలు భారత్ పై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలన్నారు.
ప్రధానిపై పాక్ మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడలో భాజపా నిరసనలు - ntr district news
BJP Protest in Vijayawada:ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ మంత్రి బిలావల్ బుట్టోకి వ్యతిరేకంగా విజయవాడలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు పార్టీ శ్రేణులుతో కలసి నిరసన చేశారు.
![ప్రధానిపై పాక్ మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడలో భాజపా నిరసనలు Etv Bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17235413-836-17235413-1671283723922.jpg)
Etv Bharat
పాకిస్థాన్ మంత్రికి వ్యతిరేకంగా విజయవాడలో నిరసనలు చేసిన భాజపా