ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అవినీతి రాజకీయాలకు రాష్ట్రం కేంద్రంగా మారింది: సోము వీర్రాజు - BJP State Meet

BJP State Level Meeting: ప్రజా వనరులను దోచుకుని.. ఆ డబ్బుతో ఓట్లు కొంటున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు. జగన్ వైఫల్యాలను, ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరించే ప్రజా పోరాటం చేయాలని పదాధికారులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో.. రాష్ట్ర కార్యదర్శులతో ఆయన సమావేశం నిర్వహించారు.

BJP State Level Meeting
బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం

By

Published : Mar 21, 2023, 4:57 PM IST

BJP State Level Meeting: భారతీయ జనతా పార్టీకి రాజకీయాలు ప్రధానం కాదని.. సబ్‌కా సాత్‌, సబ్‌కా వికాస్‌ అనేదే తమ లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రాష్ట్రాభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని.. ఇప్పటివరకు ఎనిమిది లక్షల 16 వేల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వీర్రాజు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి పదాధికారుల సమావేశం ఏర్పాటు చేశారు.

జగన్ వైఫల్యాలను వివరించే ప్రజా పోరాటానికి.. బీజేపీ పిలుపు

పార్టీ జాతీయ సహ సంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ జీ, జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి, జాతీయ కార్యదర్శులు అరవింద్ మీనన్, సునీల్ దేవదర్, వై.సత్యకుమార్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణపై ఈ భేటీలో చర్చించి ఓ కార్యాచరణ రూపొందించనున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వీర్రాజు తన ప్రారంభ ఉపన్యాసంలో తెలిపారు. రాష్ట్రంలో కీలక రాజకీయాలు చోటు చేసుకుంటున్న తరుణంలో ఈ సమావేశం ఏర్పాటు ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పారు.

త్వరలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఛార్జిషీటు దాఖలు చేయనున్నట్లు ప్రకటించారు. అవినీతి రాజకీయాలకు రాష్ట్రం కేంద్రంగా మారిందని ఆరోపించారు. ఇంత ఘోరమైన పరిస్థితి ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. సహజ వనరులను దోచుకుని - దాచుకుంటున్నారని దుయ్యబట్టారు. రాజకీయం‌ చేసి ఓట్లు కొంటున్నారని.. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ‌పదో తరగతి వాళ్లతో ఓట్లు ‌వేయించడం కంటే దిగజారుడు రాజకీయాలు ఏముంటాయని ప్రశ్నించారు.

బీజేపీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు అంతి‌మం కాదని.. గతంలో 1996లో రాష్ట్రంలో 16శాతం వస్తే, 1998లో 35శాతంతో రెండు ఎంపీ సీట్లు సాధించామని.. ఆ తరువాత ఒక్క శాతానికి పడిపోయినా, మళ్లీ‌ 14 శాతానికి పెరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 12 శాతం ఓట్లు వచ్చాయని తెలిపారు.

రాష్ట్రంలో ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత ఉందని.. రెండో ప్రాధాన్యత ఓటును బీజేపీకి‌ వేశారంటే. మోదీ మీద అభిమానం ఉందని చెప్పారు. పోలింగ్ బూత్ స్థాయిలో మరింత బలోపేతం చేయాల్సి ఉందన్నారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు ఈర్ల శ్రీరామమూర్తి బీజేపీలో చేరినట్లు వీర్రాజు ప్రకటించారు. పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు.

"బీజేపీ లక్ష్యం.. భారతదేశంలో సబ్​కా సాత్.. సబ్​కా వికాస్ అనే ఆలోచన. ఈ రాష్ట్రాన్ని 8 లక్షల 16 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తూ.. అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. సబ్​కా సాత్.. సబ్​కా వికాస్ అంటేనే రైతుల దగ్గర నుంచి, సామాన్య మహిళల దగ్గర నుంచి, సామాన్య ప్రజల దగ్గర నుంచి.. అనేక రకాల కార్యక్రమాలతో మనం ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడున్న ప్రభుత్వం.. ప్రజల వనరులను దోచుకొని.. దాచుకోవాలనుకునే ప్రయత్నంలో ఉన్నారు. డబ్బుతో రాజకీయాలు నడుపుతున్నారు. దొంగ ఓట్లతో రాజకీయాలు చేస్తున్నారు. ప్రభుత్వపై ఉన్న వ్యతిరేకతని ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలి. మోదీ చేస్తున్న మంచి పనులను ప్రజలకు తెలియజేయాలి".- సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details