Somuveerraju: దిల్లీ పెద్దలతో భేటీ అనంతరం విమానాశ్రయం చేరుకున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ సునీల్ ధియోధర్కు నాయకులు స్వాగతం పలికారు. రైతు సంబంధిత కేంద్ర పథకాలను జగన్ సొంత పథకాలుగా ప్రచారం చేసుకున్నారని, దీనిపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశామని సోమువీర్రాజు తెలిపారు. అమరావతి రైతుల యాత్రపై వైకాపా ఎంపీ దాడి చేయించడాన్ని ఆయన ఖండించారు. ఇటువంటి ఘటనలు ఎవరూ ప్రోత్సహించకూడదని అన్నారు. దాడులను ప్రేరేపించింది వైకాపా నాయకులేనని సోమువీర్రాజు ఆరోపించారు. బొత్స కూడా వాస్తవం తెలుసుకుని మాట్లాడాలని హితవుపలికారు.
చంద్రబాబు, పవన్ కలవడాన్ని స్వాగతిస్తున్నాను: సోము వీర్రాజు - ఏపీ తాజా వార్తలు
Somuveerraju: రైతు సంబంధిత కేంద్ర పథకాలను జగన్ సొంత పథకాలుగా ప్రచారం చేస్తున్నారని దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేశామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. అమరావతి రైతుల పాదయాత్రపై వైకాపా ఎంపీ దాడి చేయించటాన్ని ఆయన ఖండించారు. చంద్రబాబు పవన్ కలవటాన్ని ఆయన స్వాగతిస్తున్నానన్నారు.
పవన్ యాత్రను ప్రభుత్వం నిలిపింది, నిర్బంధించిందన్న ఆయన... ఇలాంటి ఘటనలు సరి కాదని పవన్‌ను సంఘీభావంగా అందరూ కలిశారన్నారు. చంద్రబాబు, పవన్ కలవడాన్ని తాను స్వాగతిస్తున్నానన్నారు. కన్నా లక్ష్మీనారాయణ తమ పార్టీలో చాలా పెద్దలన్న సోమువీర్రాజు... ఆయన విషయంలో తాను స్పందించనని చెప్పారు. ఆయనేదో అన్నారని తాను అన్నింటికీ స్పందించనని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంత వరకు మాట్లాడాలో అంతే మాట్లాడతానన్నారు. రోడ్ మ్యాప్ పవన్ అడుగుతున్నారని... తమ పెద్దలు నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. పవన్‌కు భాజపా పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. భాజపా, జనసేన కలిసే ముందుకు వెళతాయని స్పష్టంచేశారు. చంద్రబాబు, పవన్ కలసినందువల్ల మీడియా ఎక్కువ కంగారు పడుతుందన్న సోమువీర్రాజు... ఏపీలో జరిగిన పరిణామాలు అన్నీ తమ పార్టీ పెద్దలకు వివరించామని తెలిపారు.
ఇవీ చదవండి: