ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంద్రకీలాద్రిపై ఘనంగా ప్రారంభమైన భవానీ దీక్ష విరమణలు- పోటెత్తిన భక్తులు - ఇంద్రకీలాద్రి ఆలయం

Bhavani Deeksha Viramana at Indrakiladri: ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణలు ప్రారంభమయ్యాయి. ఆలయానికి విచ్చేసిన భవానీ భక్తులకు ఎలాంటి అసౌర్యాలు కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Bhavani_Deeksha_Viramana_at_Indrakiladri
Bhavani_Deeksha_Viramana_at_Indrakiladri

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 3, 2024, 12:34 PM IST

Bhavani Deeksha Viramana at Indrakiladri: విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణలు ఘనంగా ప్రారంభమైయ్యాయి. నేటి నుంచి ఐదు రోజులపాటు దీక్ష విరమణలు కొనసాగనున్నాయి. దుర్గామల్లేశ్వర దేవస్థానం ఛైర్మన్ కర్నాటి రాంబాబు, ఆలయ ఈవో రామారావు, ఆలయ స్థానాచార్యుడు శివప్రసాద్ శర్మ, ఇతర అర్చకులు నాలుగు హోమగుండాలను వెలిగించి అగ్ని ప్రతిష్టాపన చేశారు.

భవానీ భక్తులు అమ్మవారి దర్శన అనంతరం నేతి టెంకాయలు హోమగుండంలో సమర్పించి దీక్షలను విరమిస్తున్నారు. 'జై దుర్గా జై జై దుర్గా' నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది. కనుచూపు మేరకు ఎర్రని దుస్తులతో ఇంద్రకీలాద్రి ఆలయానికి భవాని భక్తులు పోటెత్తారు. ప్రత్యేక కౌంటర్లలో భవానీ భక్తులు ఇరుముడులను సమర్పిస్తున్నారు.

ఇంద్రకీలాద్రిపై ₹216 కోట్ల పనులకు సీఎం జగన్ శంకుస్థాపన

300 మంది గురు భవానీలు కేశఖండనశాలలో 850 మంది క్షురకులను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. 20 లక్షల లడ్డూలను భవానీల కోసం సిద్ధం చేశారు. గిరి ప్రదక్షణలో భవానీ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ నెల 7వ తేదీ వరకు భవానీ దీక్ష విరమణలు జరగనున్నాయి. భవాని భక్తులకు రాత్రి 11.00 గంటల వరకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పిస్తారు.

రాష్ట్రం నుంచే కాక దేశం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భవానీ భక్తులు వస్తున్నందున పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా పర్యవేక్షణలో 4,200 మంది పోలీసులను బందోబస్తుకు వినియోగిస్తున్నారు.

"ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు ఉదయం 6 గంటల 35 నిమిషాలకు సూర్యాదియాది ముహూర్త సమయంలో ఇరుముడి అగ్నిగుండాలు ప్రారంభించాం. నేటి నుంచి ఐదురోజుల పాటు భవానీ దీక్ష విరమణలు కొనసాగనున్నాయి. ఈ నెల 7వ తేదీ ఉదయం 10 గంటల 30 నిమిషాల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రం నుంచే కాక దేశం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భవానీ భక్తులు వస్తున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం." - శివప్రసాద్ శర్మ, ఆలయ స్థానాచార్యుడు

"భవానీ దీక్ష విరమణల నేపథ్యంలో 300 మంది గురు భవానీలు కేశఖండనశాలలో 850 మంది క్షురకులను ఆలయ అధికారులు ఏర్పాటు చేశాం. భక్తులకు 20 లక్షల లడ్డూలను భవానీల కోసం సిద్ధం చేశాం. గిరి ప్రదక్షణలో భవానీ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా పర్యవేక్షణలో 4,200 మంది పోలీసులను బందోబస్తుకు వినియోగిస్తున్నారు." - రామారావు, ఆలయ ఈవో

దుర్గగుడి అభివృద్ధిపనులకు సీఎం మరోసారి శంకుస్థాపన కార్యక్రమం

ABOUT THE AUTHOR

...view details