GVL Narasimha Rao key comments on the Polavaram project: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నిధులకు సంబంధించి.. రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు కీలక విషయాలు వెల్లడించారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. త్వరలో కేంద్ర ప్రభుత్వం రూ. 12 వేల 911 కోట్ల రూపాయలు విడుదల చేయబోతోందని తెలిపారు. ఎటువంటి రాజకీయ లబ్ధిని ఆశించకుండా కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు మంజూరు చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్న నిధులను.. గుట్టు చప్పుడు కాకుండా ఖర్చు చేస్తున్న జగన్ ప్రభుత్వం.. ఆ మొత్తాన్ని ఎవరు ఇస్తున్నారో.. ప్రజలకు చెప్పడం లేదని ఆయన ఆక్షేపించారు.
రూ. 12వేల 911 కోట్లు కేటాయింపు..అనంతరంపోలవరం ప్రాజెక్టునిర్మాణం, నిధులకు సంబంధించి త్వరలోనే కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందని.. జీవీఎల్ నరసింహారావు తెలిపారు. రాష్ట్రం అప్పులు ఊబిలో కూరుకుందని ఆయన మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే విషయంలో ప్రధాని మోదీ సానుకూలంగా ఉన్నారని, ఈ ప్రాజెక్ట్‌కి అదనంగా రూ. 12 వేల 911 కోట్ల రూపాయలు కేటాయించారని వివరించారు. 41.15 మీటర్ల వరకు పోలవరం తొలి దశ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్యం నిధులు ఇస్తుందని వెల్లడించారు.
''పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వెంటనే పూర్తవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాలలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తూ వచ్చింది. పోలవరం ప్రాజెక్ట్‌ను తామే నిర్మిస్తామని గత ప్రభుత్వం హయాంలో చేసిన హామీ వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ చొరవ మేరకు ఆర్థిక శాఖ గతంలో (2014-15) ఇచ్చిన నిధులకు అతీతంగా అదనంగా మరో రూ.12 వేల 911కోట్ల రూపాయలను ఇవ్వబోతుంది. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల కల సాకారం కాబోతుంది. ఈ విషయాలన్నింటినీ వైసీపీ చెప్పదు.. ఎందుకంటే సీక్రెట్‌గా దీనికి వాళ్ల స్టిక్కర్ వేసుకోవాలనే ఆలోచనలో ఉంది. ప్రజలకు ఈ విషయాలు తెలియాలి కాబట్టి మేమే బహిర్గతం చేస్తున్నాం.'' -జీ.వీ.ఎల్ నరసింహారావు, రాజ్యసభ సభ్యులు
Polavaram Project: పోలవరం పూర్తికి గడువు కోరిన రాష్ట్రం.. వచ్చే జూన్ కల్లా పూర్తిచేయాలన్న కేంద్రం!