AP NGO Bandi Srinivasa Rao On MLC : వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని గెలిపించాలని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బాహాటంగా ప్రకటించడాన్ని ఏపీ ఎన్జీఓ నేత నేత బండి శ్రీనివాసరావు తప్పు బట్టారు. ఏ ఉద్యోగ సంఘమైనా, ఉద్యోగులైనా ఎన్నికల్లో పాల్గోనే వ్యక్తికి ప్రచారం చేయటం లేదా ఓటు వేయాలని అడగటం సర్వీసు నిబంధనలకు విరుద్ధమని ఏపీ ఎన్జీఓ నేత బండి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. వైెఎస్సార్సీపీ అభ్యర్ధులకు ఓట్లు వేయాలంటూ ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామి రెడ్డి చేసిన అభ్యర్ధనపై స్పందించిన బండి ఇది పూర్తిగా సర్వీసు నిబంధనలకు విరుద్ధమని అన్నారు. ఏ ఉద్యోగ సంఘమూ ఎన్నికల్లో పాల్గొనే వ్యక్తికి ప్రచారం చేయటం లేదా ఓటు వేయాలని అడగటం నిషేధమని అన్నారు. ఏపీ ఎన్జీఓ సంఘం ఏ పార్టీకీ ఓటు వేయాలని అభ్యర్ధించబోదని అన్నారు. మరో వైపు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్న ఉపాధ్యాయ సంఘాల నేతలు హృదయ రాజు, తిమ్మన్నలకు షోకాజ్ నోటీసు జారీ చేయటంపై తీవ్రంగా స్పందించారు. నోటీసులు వెనక్కు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.
" మా సెక్రటరీ జనరల్ హృదయ రాజు మీద ఇవాళ అలాగే కో చెర్మైన్ అయినటువంటి తిమ్మన్న మీద ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలు సందర్భంగా ఉపాధ్యాయులే నామినేషన్ ఫారం మీద ప్రపోజల్స్ పెట్టే అవకాశం ఉంటది. ఎప్పుడు కూడా ప్రభుత్వంలో ఈ విధమైనా చర్యలు తీసుకోలేదు. కొంత మంది డీఈఓలు అలాగే స్పెషల్ ఆఫీసర్లు వాళ్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చి ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా జరుగకుండా ఉపాధ్యాయులను భయాభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి సంఘటన జరిగింది. దానికి ఏపీ జేఏసీ విజయవాడ పక్షాన, ఏపీ ఎన్జీఓ పక్షాన మేము పూర్తిగా ఖండిస్తున్నాము. దయచేసి ఆ షోకాజ్ నోటీసును విత్డ్రా తీసుకోవాలి. లేకపోతే దానికి తగినటువంటి పరిణామాలు కూడా మా జేఏసీ ద్వారా ఉంటాయని కూడా హెచ్చరిక తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ఇట్లాంటి అధికారుల పట్ల చర్యలు తీసుకోవాలని గట్టిగా తెలియజేస్తున్నాం. " - బండి శ్రీనివాసరావు, ఏపీ ఎన్జీఓ నేత