Ban on flexi will come into effect from January 26: జనవరి 26వ తేదీ నుంచి రాష్ట్రంలో ప్లాస్టిక్ వినియోగంపై నిషేదం అమల్లోకి వస్తోందని రాష్ట్ర పర్యావరణ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ అన్నారు. ప్లెక్సీ ప్రింటింగ్ రంగంపై ఆధారపడిన వారికి ప్రత్యామ్నయం చూపించాలనే ఉద్దేశంలో విజయవాడలోని ఓ కళ్యాణ మండపంలో ప్లెక్సీ వినియోగం, ప్రత్యామ్నయ మార్గాలపై అవగాహన సదస్సును ఆయన ప్రారంభించారు.
ఫ్లెక్సీ రంగం కార్మికులను ఆదుకుంటాం.. : నీరభ్ కుమార్ ప్రసాద్
Ban on flexi will come into effect from January 26: జనవరి 26 నుంచి రాష్ట్రంలో ప్లాస్టిక్ వినియోగంపై నిషేదం అమల్లోకి వస్తోందని రాష్ట్ర పర్యావరణ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ తెలిపారు.ప్లెక్సీ ప్రత్యామ్నయ మార్గాలపై విజయవాడలో ఆయన వర్క్ షాప్ ను ప్రారంభించారు. ఈ రంగంపై ఆధారపడిన వారికి నూతన పథకాలు ప్రవేశపెట్టి, ప్రభుత్వం అండగా ఉంటుందని .. నీరభ్ వెల్లడించారు.
జనవరి 26 నుంచి ప్లాస్టిక్ నిషేదం
ఈ సందర్భంగా నీరభ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ రంగం పై ఆధారపడిన వారికి నూతన పథకాలు ప్రవేశపెట్టి అండగా నిలిచేలా చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చారు. ప్లాస్టిక్ వ్యర్థాల సమస్య రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోయిందని, నివారణకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా చెన్నైలో జరుగుతున్న మార్పులను ఇక్కడ కూడా అనుసరించాలని సూచించారు.
ఇవీ చదవండి: