ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం దుకాణాలు తనఖా పెట్టి అప్పులా..! : అయ్యన్నపాత్రుడు - సీఎం జగన్ పై అయ్యన్న వ్యాఖ్యలు

Ayyanna Comments on Govt: టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు అధికార పార్టీ పై ధ్వజమెత్తారు. రాష్ట్రం నుంచి సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్‌లే కాకుండా, అండర్ వేర్ కంపెనీలు కూడా రాష్ట్రం నుంచి తరలిపోతున్నాయని ఎద్దేవా చేశారు. అలాగే పక్క రాష్ట్రం ఐటీ మంత్రి ఏం చేస్తున్నారో చూసి అమర్నాధ్ నేర్చుకోవాలని హితవుపలికారు. దూరంగా ఉండి ఎన్నికల వేళ మళ్లీ పార్టీకి చేరువ కావడం సరికాదని గంటా శ్రీనివాసరావును ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

Ayyanna
అయ్యన్న

By

Published : Jan 19, 2023, 7:45 PM IST

Ayyanna Comments on Govt: సాఫ్ట్​వేర్, హార్డ్​వేర్‌లే కాకుండా, అండర్​వేర్ కంపెనీలు కూడా రాష్ట్రం నుంచి తరలిపోతున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. జాకీ అండర్​వేర్ కంపెనీని కేటీఆర్ తెలంగాణాకు పట్టుకుపోయారని ఆయన గుర్తు చేశారు. మద్యం దుకాణాలను 25 ఏళ్లకు తనఖా పెట్టి 8 వేల 7 వందల కోట్లు అప్పు తెస్తారా అంటూ మండిపడ్డారు.

పక్క రాష్ట్రం ఐటీ మంత్రి ఏం చేస్తున్నారో చూసి అమర్నాథ్​ నేర్చుకోవాలని హితవు పలికారు. తమలాంటి వారిని తిట్టడానికే అమర్నాథ్‌కు మంత్రి పదవి ఇచ్చారని దుయ్యబట్టారు. త్వరలో టీడీపీ బీసీ నేతలు సమావేశమై, 3 ప్రాంతాల్లో సదస్సులు పెడతామని అయ్యన్నపాత్రుడు తెలిపారు.

పార్టీలోకి అందరూ రావాలి, కష్టకాలంలో పార్టీ కోసం పని చేయాలనేదే తమ ఆకాంక్ష అని తెలుగుదేశం సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదన్న అయ్యన్న.. ఇన్నాళ్లు దూరంగా ఉండి ఎన్నికల వేళ మళ్లీ పార్టీకి చేరువ కావడం సరికాదని గంటా శ్రీనివాసరావును ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా పార్టీకి అండగా ఉండాలనే తాము కోరుకుంటామన్నారు.

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details