Attack On Textile Traders Case two accused Arrested: ధర్మవరం వస్త్ర వ్యాపారస్తులపై దాడి చేసిన ఆలయ సిల్క్స్ ఎండీ అవినాష్ గుప్తాతో పాటు మరొ ఇద్దర్ని పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టినట్లు సీపీ చెప్పారు. బకాయిలు అడిగినందుకే వ్యాపారులపై దాడి చేశారని.. ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని అన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన వస్త్ర వ్యాపారులు శశి, ఆనంద్.. విజయవాడకు చెందిన ఆలయ శిల్క్స్‌కు వస్త్రాలు విక్రయించారు. దానికి సంబంధించి దుకాణ యజమాని అవినాష్ గుప్తా 2లక్షల 34 వేల రూపాయలు ఈ వ్యాపారులకు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తానికి చెక్కులు ఇవ్వగా బౌన్స్ అయ్యాయి. ఈ పరిస్థితుల్లో బకాయిల వసూలు కోసం జూన్ 2న బకాయిలు వసూలు చేసుకోవటం కోసం విజయవాడకు వచ్చారని తెలిపారు.
విజయవాడకు వచ్చిన ఇద్దరు వ్యాపారులు.. వారికి రావాల్సిన నగదు గురించి అవినాష్‌ను అడిగారని వివరించారు. ఆ సమయంలో వ్యాపారులకు, అవినాష్‌కు మధ్య గొడవ జరిగిందని.. విజయవాడ సీపీ కాంతిరాణా టాటా చెప్పారు. ఈ దాడిలో అవినాష్‌కు మరో ఇద్దరు సహాకరించారని వెల్లడించారు. వీరు ముగ్గురు కలిసి వ్యాపారులను నిర్బదించి.. షాప్ లోపల వెనక్కి తీసుకువెళ్లారని తెలిపారు. ఆ తర్వాత వ్యాపారుల దుస్తులు ఊడదీసి 4 గంటలపాటు చిత్రహింసలు పెట్టడం, ప్లాస్టిక్ కర్రతో కొట్టడం చేశారని వెల్లడించారు.