ATM center Problems: విత్‌డ్రా చేయాలనుకున్న మొత్తానికి సమానమై నగదు.. ఎక్కువ వస్తుండటంతో ఓ ఏటీఎం కేంద్రానికి వినియోగదారులు ఎగబడ్డారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు బ్యాంకు ఏటీఎం కేంద్రంలో ఈ వ్యవహారం వెలుగుచూసింది. ఇవాళ ఓ వ్యక్తి ఈ ఏటీఎంలో రూ.1000 విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించారు. అయితే.. రూ.1000కి బదులు.. రూ.2000 రావడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు! మరోసారి అదే విధంగా చేయగా.. మళ్లీ రూ.2,000 వచ్చాయి. దీంతో స్థానికంగా ఈ విషయం ఒక్కసారిగా దావానలంలా వ్యాపించింది.
రూ.1000 కొడితే రూ.2000.. ఏటీఎం కేంద్రానికి ఎగబడ్డ జనం - latest ap news
Technical Problems in ATM: ఏటీఎంకు వెళ్లి డబ్బులు డ్రా చేస్తుండగా రూ.1000 డ్రా చేస్తే రూ.2000 వచ్చాయి. ఎన్నిసార్లు చేసినా డబ్బులు వస్తూనే ఉన్నాయి. ఇలా ఉచితంగా డబ్బులు వస్తే ఎవరు కాదనుకుంటారు? అందుకే ఒక్కసారిగా డబ్బులు రావడంతో జనాలు బారులు తీరారు. ఎక్కడో తెలుసా..!
ఏటీఎం
వెంటనే నగదు ఉపసంహరణ కోసం స్థానికులు పెద్దఎత్తున ఏటీఎం వద్ద గుమిగూడారు. ఈ క్రమంలోనే బ్యాంకు అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు అక్కడికి చేరుకుని ఏటీఎం కేంద్రాన్ని మూసివేశారు. మరోవైపు బ్యాంకు అధికారులు.. ఎవరెవరు ఎంతమొత్తంలో నగదు తీసుకున్నారో ఆరా తీసే పనిలో పడ్డారు.
ఇవీ చదవండి: