Letter to DGP on security arrangements: ఈ నెల 27, 28వ తేదీల్లో జరగనున్న మహానాడుకు భద్రతా ఏర్పాట్లు కల్పించాల్సిందిగా కోరుతూ డీజీపీకి, రవాణ ఏర్పాట్ల కొరకు ఆర్టీసీ ఎండీకి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు లేఖలు రాశారు. రాజమహేంద్రవరం, కడియం మండలంలోని వేమగిరి గ్రామంలో మహానాడు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. మహానాడుకు లక్షలాదిమంది ప్రజలు హాజరవుతారని, ఎటువంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగినంత పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేయండని కోరారు. సాధారణ ప్రజలకు ఎటువంటి ట్రాపిక్ ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రజలు మహానాడుకు విచ్చేసేందుకు అద్దె బస్సులు ఏర్పాటు చేయాల్సిందింగా డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ చేయాలని ఆర్టీసీ ఎండీని కోరారు.
మహానాడు నిర్వాహక కమిటీలు: ఎలాంటి ఆటంకాలు జరగకుండా మహానాడు నిర్వహించడానికి, నిర్వాహక కమిటీ ఏర్పాటు చేశారు. అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో సమావేశమై కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, వాలంటీర్లకు బాధ్యతల అప్పగింత, కమిటీల నియామకంపై నేతలు సూచనలు చేశారు. విజయదశమికి సమగ్రమైన, రాష్ట్ర భవిష్యత్తును మార్చే మ్యానిఫెస్టో విడుదల చేస్తామని అచ్చెన్నాయుడు చెప్పారు. మాహానాడులో 15 తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదిస్తామని మరో నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు.