ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Atchannaidu Condemned the TDP Leaders House Arrest: టీడీపీ నేతలు హౌస్ అరెస్ట్.. "శునకానందం పొందుతున్న వైసీపీ నేతల మాటల్ని పోలీసులు వినొద్దు" - TDP leaders house arrest news

Atchannaidu Condemned the TDP Leaders House Arrest: గత కొన్ని రోజులుగా టీడీపీ నేతలు చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమాలను అణచివేసేందుకు పోలీసులు నేతలను ఎక్కడికక్కడి గృహ నిర్బంధం చేస్తున్నారు. పండగ రోజున కూడా గృహ నిర్బంధం చేయడాన్ని అచ్చెన్నాయుడు ఖండించారు. శునకానందం పొందుతున్న వైసీపీ నేతల మాటల్ని పోలీసులు వినొద్దని హితువు పలికారు.

achenna_on_house_arrests
achenna_on_house_arrests

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 19, 2023, 12:42 PM IST

Atchannaidu Condemned the TDP Leaders House Arrest : రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతల గృహ నిర్బంధాలను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఖండించారు. 'సైకో రెడ్డి' పాలనలో దేవుడిని చూసే భాగ్యం కూడా లేదా అని ప్రశ్నించారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేవని గుర్తుంచుకో జగన్ రెడ్డి అని హితవు పలికారు. నారా చంద్రబాబు నాయుడు ప్రజల మనిషని.. తన జీవితమంతా ప్రజాసేవకే అంకితమైన గొప్ప వ్యక్తిని జగన్ అక్రమ కేసులు బనాయించి జైల్లో (Naidu in Custody)పెట్టాడని మండిపడ్డారు.

Protest Against Chandrababu Arrest :చంద్రబాబు నిర్ధోషిగా బయటకు రావాలని భగవంతుని ప్రార్థించేందుకు ఆలయాలకు వెళ్తున్న టీడీపీ నేతలను అడ్డుకోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ఏం తప్పు చేశారని గృహ నిర్బంధాలు చేస్తున్నారని ప్రశ్నించారు. దేవుడికి బాధలు చెప్పే స్వేచ్ఛ కూడా ఈ దుర్మార్గుడి పాలనలో లేదనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలన్నారు. చంద్రబాబు అరెస్ట్ సమయం నుంచి టీడీపీ నేతలనుగృహనిర్బంధం చేస్తూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Protest Abroad Against Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టుపై మిన్నంటిన నిరసన.. విదేశాల్లో తెలుగు ప్రజల ఆందోళన

వైసీపీ అరాచకాలు బయటపడతాయని భయమా, తమ వాళ్లు చేసిన తప్పేంటని నిలదీశారు. ఎక్కడైనా విధ్వంసాలకు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారా అని అడిగారు. పోలీసులు కూడా చట్టాలను అతిక్రమించి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. హద్దులు దాటి అణచివేతకు గురి చేస్తున్నారని, చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి శునకానందం పొందుతున్న వైసీపీ నేతల మాటల్ని పోలీసులు వినొద్దని కోరారు.

చంద్రబాబు కోసం అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా రోడ్డుపైకి వస్తుంటే అడ్డుకోవడం దేనికి సంకేతమని అన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నా రాజారెడ్డి రాజ్యాంగాన్నే అమలు చేస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. టీడీపీ నేతలను గృహ నిర్భంధాలు చేయడం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు.

పోలీసులకు టీడీపీ నేతల మధ్య వాగ్వాదం : మాజీ మంత్రి దేవినేని ఉమ, బుద్దా వెంకన్నలను పోలీసులు అరెస్ట్ చేసారు. విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ తరలించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసన గా దుర్గగుడిలో అమ్మవారికి సారే సమర్పించేందుకు దేవినేని ఉమా వినాయకుడి గుడి వద్దకు వచ్చారు. అనుమతి లేదంటూ పోలీసులు ఉమను అరెస్ట్ చేసి స్టేషన్​కు తరలించారు. పోలీసుల తీరును తప్పు బట్టిన బుద్దా వెంకన్న పోలీసులకు కొబ్బరికాయలు కొట్టారు. దీంతో పోలీసులకు టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

Protests Across State Against Chandrababu Naidu Arrest చంద్రబాబు అరెస్టుతో అట్టుడికిన రాష్ట్రం.. టీడీపీ శ్రేణుల నిరసనతో ఎక్కడికక్కడ అరెస్టులు, గృహనిర్బంధాలు

జగన్ మోహన్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపులో భాగంగా అక్రమ అరెస్టుపై రిమాండ్​లో ఉన్న తమ నాయకుడు చంద్రబాబు రిమాండ్ ఫిటిషన్ రద్దు చేయాలని.. హైకోర్టులో వాయిదా ఉన్నందున కనకదుర్గమ్మ తల్లిని దర్శించి, అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమానికి బయలుదేరితే తమని ఆరెస్ట్ చేయటంపై నేతలు మండిపడ్డారు.

గుంటూరు కారం రుచి చూపించినా ఈ ప్రభుత్వానికి గుణపాఠం రాలేదు : రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారిని పోలీసులు హౌస్ అరెస్ట్ (TDP Leaders House Arrest) చేశారు. గుంటూరులో టీడీపీ ఇన్చార్జ్ మహిళలతో పెద్ద ర్యాలీలో పాల్గొనాలని ఇచ్చిన పిలుపుకు అనుమతి లేదంటూ 2టౌన్ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ర్యాలీకి వెళ్లకూడదంటు టీడీపీ నాయకులకు నోటీసులు పోలీసులు అందజేశారు. నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ.. గత రెండు రోజుల క్రితం మహిళలు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టి గుంటూరు కారం రుచి చూపించినా ఈ ప్రభుత్వానికి బుద్ది రాలేదని అన్నారు. తెల్లవారుజామున 5గంటలకి పోలీసులు వచ్చి నోటీసులు అందజేశారని, హౌస్ అరెస్టులు చెయ్యటం బాధాకరమని తెలిపారు. చంద్రబాబుపై వారి కుటుంబంపై ఇంత కక్ష సాధింపు చర్య వల్ల ప్రజలు ఆగ్రహవేశాలతో ఉన్నారని, ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయని హెచ్చరించారు.


TDP Leaders House Arrest : తెల్లవారకముందే..! ఇళ్లను చుట్టుముట్టిన పోలీసులు.. టీడీపీ నేతల గృహ నిర్బంధం

ABOUT THE AUTHOR

...view details