AT Home : గణతంత్ర దినోత్సవ సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఇచ్చిన తేనేటి విందుకు ప్రముఖులు హాజరయ్యారు. విజయవాడ రాజ్‌భవన్‌లో జరిగిన 'ఎట్ హోమ్' కార్యక్రమానికి హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్, సీఎం జగన్ దంపతులు, తేనేటి విందులో పాల్గొన్నారు. కాగా గవర్నర్, సీఎం, సీజే ఒకే టేబుల్ పై కూర్చున్నారు. సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమైన కార్యక్రమం 5.15 గంటల వరకు కొనసాగింది. కార్యక్రమానికి హాజరైన అతిథులను గవర్నర్ పలకరించారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధు, స్పీకర్ తమ్మినేని సీతారాం, డీజీపి రాజేంద్రనాథ్ రెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డి, మంత్రి జోగిరమేష్, పలువులు వైసీపీ ఎమ్మేల్యేలు, ప్రజాప్రతినిధులు, పద్మ అవార్డ్ గ్రహీతలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
గవర్నర్ తేనేటి విందుకు హాజరైన ప్రముఖులు - ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరైన హైకోర్టు సీజే
AT Home : గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్... తేనేటి విందు ఇచ్చారు. విజయవాడ రాజ్‌భవన్‌లో జరిగిన 'ఎట్ హోమ్' కార్యక్రమానికి హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, సీఎం జగన్, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
ఎట్ హోం