Kanumuri Subbaraju : కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో రెవెన్యూ అధికారులు, కొందరు నాయకులు కుమ్మక్కై భూదందా నడుపుతున్నారంటూ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ కనుమూరి సుబ్బరాజు ఆరోపించారు. గంగాప్రసాద్ అనే ఓ మాజీ సైనికోద్యోగి మల్లవల్లిలో తనకు భూమికేటాయించాలని.. రెండేళ్ల క్రితం దరఖాస్తు చేశాడు. ఆ దరఖాస్తును పెండింగ్‌లో పెట్టి , సదరు భూమిని వేరొకరికి కేటాయించారని ఆయన మండిపడ్డారు. అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేకపోవడం దారుణమని మండిపడ్డారు. మల్లవల్లి భూ అక్రమాలపై రెవెన్యూ మంత్రికి ఫిర్యాదు చేయనున్నట్లు సుబ్బరాజు తెలిపారు.
అధికారులు, నేతల భూ దందా పై రెవెన్యూ మంత్రికి ఫిర్యాదు చేస్తా: కనుమూరి - AP News telugu
Kanumuri Subbaraju : కృష్ణా జిల్లా బాపులపాడులో రెవెన్యూ అధికారులు భూ దందా తన దృష్టికి వచ్చిందని, అధికారులు నాయకులతో కుమ్మక్కై.. అవినీతికి పాల్పడుతున్నారని.. ఏపీఆర్డీసీ ఛైర్మన్ కనుమూరి సుబ్బరాజు ఆరోపించారు. మండలంలో మాజీ సైనికోద్యొగికి భూ కేటాయింపుకు వివరాలపై ఆరా తీస్తే, రెవెన్యూ శాఖ అధికారులు స్పందించటం లేదని ఆయన మండిపడ్డారు.
"చేస్తాం, చూస్తాం అనటమే తప్పా, కలెక్టరు చెప్పినా స్పందన లేదు. ఆర్డీవో చెప్పిన స్పందన లేదు. చివరికి స్పందనలో ఫిర్యాదు చేసిన స్పందిచటం లేదు. అంటే వీరికి ప్రభుత్వం అన్న లెక్కలేదు. ప్రజానాయకులు అన్న లేక్కలేదు. మాజీ సైనికాధికారి అర్హత ఉన్న వ్యక్తి. అర్హత ఉంటేనే ఇవ్వండి. లేకపోతే లేదని చెప్పండి. ఇతడ్ని కాదని ఇతని తర్వాత దరఖాస్తు చేసుకున్న వారికి ఇచ్చారు. రెవెన్యూ శాఖ ప్రభుత్వ భూములను కాపాడాలి. నేను పదవిలో ఉండి వారి చుట్టూ తిరిగినా నాకే సమాధానం లేదు. అసలు లెక్కే లేదు. ఇక సామన్యుడికి ఏం సమాధానం చేప్తారు." -కనుమూరి సుబ్బరాజు, ఏపీఆర్డీసీ ఛైర్మన్
ఇవీ చదవండి: