- చంద్రబాబు స్క్రిప్ట్.. పవన్ కల్యాణ్ యాక్టింగ్: సీఎం జగన్
JAGAN FIRES ON CBN AND PAWAN : రాజకీయం అంటే.. ప్రతి పల్లె అభివృద్ధి చేయడమని.. మూడేళ్లలో అది చేసి చూపించామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. నర్సీపట్నంలో 500 కోట్లతో మెడికల్ కాలేజ్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. రూ.450 కోట్ల వ్యయంతో నిర్మించే ఏలేరు-తాండవ జలాశ్రయాలు అనుసంధానం చేసే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ సభలో చంద్రబాబు, పవన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- జగన్‌కు బీసీలు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే రోజు దగ్గరలోనే ఉంది: చంద్రబాబు
Chandrababu Comments on Jagan : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బీసీలను మోసం చేస్తున్నాడని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ బీసీలకు చేయూతనిచ్చిందని తెలిపారు. టీడీపీ బీసీ సంక్షేమం కోసం నిర్వహించిన కార్యక్రమాలను వైసీపీ తొలగించిందని విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఎప్పటినుంచంటే..!
SSC EXAM SCHEDULE : రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరగనున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- చిత్తూరు జిల్లాలో ఉద్రిక్తత.. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతల రాళ్లదాడి
YCP leaders pelted stones on TDP Activists: పుంగనూరు నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. నజంపేటలో పోలీసుల సమక్షంలోనే టీడీపీ నాయకులు, కార్యకర్తలపై రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పలువురు గాయపడగా.. అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. అధికార పార్టీ తీరును నిరసిస్తూ టీడీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మోదీకి మాతృవియోగం.. దేశాధినేతల సంతాపం
ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తిని కోల్పోవడంపై ప్రపంచ దేశాల అధినేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఈ కష్ట సమయంలో మోదీ కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కారులో DMK మాజీ ఎంపీ దారుణ హత్య.. అల్లుడే స్నేహితులతో కలిసి..
డీఎంకే మాజీ ఎంపీ మస్తాన్ కొద్దిరోజుల క్రితం మరణించారు. అయితే ఆయనది సహజమరణం కాదని.. హత్య అని పోలీసుల విచారణలో తేలింది. ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నేపాల్ ప్రధానిగా ప్రచండ.. అమెరికా, భారత్‌ను చైనా దెబ్బ తీసిందా?
నేపాల్ రాజకీయ అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతోంది. ప్రధాని పదవిపై ఎన్‌సీ అధినేత షేర్ బహదూర్ దేవ్‌బా, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్-మావోయిస్టు సెంటర్ (సీపీఎన్-ఎంసీ) ఛైర్మన్ పుష్పకమల్ దహల్ (ప్రచండ) మధ్య పడిన పీటముడితో పరిస్థితులు మారిపోయాయి. సీపీఎన్-యూఎంఎల్ నేత కె.పి.శర్మ ఓలి మద్దతుతో ప్రచండ ప్రధాని పీఠమెక్కారు. ఓలి చైనా చేతిలో కీలుబొమ్మ. ఇది భారత్‌కు రుచించని పరిణామమే. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కేంద్రం కీలక నిర్ణయం.. 'చిన్న మొత్తాల' వడ్డీ రేట్లు పెంపు.. ఈ స్కీమ్‌లపైనే..
చిన్న మొత్తాల పొదుపు పథకాలపై కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. పోస్టాఫీసు టర్మ్ డిపాజిట్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, సీనియర్ సిటిజన్ స్కీమ్‌పై 1.1 శాతం వరకు వడ్డీని సవరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పంత్‌ను కాపాడిన RTC బస్సు డ్రైవర్.. రోడ్డు ప్రమాదంపై మోదీ విచారం
రోడ్డు ప్రమాదానికి గురైన టీమ్ఇండియా క్రికెటర్ రిషభ్ పంత్‌ను ఒక బస్సుడ్రైవర్ తొలుత చూసి కాపాడాడు. పంత్ అప్పుడు నడవలేని స్థితిలో ఉన్నట్లు అతడు చెప్పాడు. మరోవైపు, పంత్ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'వీరసింహారెడ్డి'లో స్పెషల్ ఎలిమెంట్.. ఫ్యాన్స్ విజిల్స్ వేయాల్సిందే!
Veera Simha Reddy : బాలకృష్ణ అంటే మాస్ యాక్షన్‌కు చిరునామా అంటుంటారు. అలాంటి మాస్ సింహం కొత్త సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కాగా, ఈ సినిమాలో మాస్, యాక్షన్ మిస్ కానప్పటికీ.. ఓ స్పెషల్ ఎలిమెంట్‌తో సంపూర్ణ చిత్రాన్ని అందిస్తారట బాలకృష్ణ. ఆ స్పెషల్ ఎలిమెంట్ ఏంటో తెలుసా.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
TOP NEWS