ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 7 PM - ap top ten news

ఏపీ ప్రధాన వార్తలు

top news
టాప్ న్యూస్

By

Published : Dec 20, 2022, 6:57 PM IST

  • జగన్​ సొంత నియోజకవర్గంలోనే చెరువులకు గండి కొట్టడం శోచనీయం: బీటెక్​ రవి
    TDP MLC RAVI : సీఎం జగన్​ సొంత నియోజకవర్గంలోని చెరువులకు గండ్లు కొట్టడం శోచనీయమని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్​ రవి విమర్శించారు. వేంపల్లె మండలం నాగూరు చెరువుకు గండి కొట్టిన విషయం తెలుసుకొని పార్టీ నాయకులు, గ్రామస్థులతో కలిసి పరిశీలించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఈత కొలను అపరిశుభ్రం.. జాతీయ క్రీడా పోటీలు వాయిదా
    Model School Swimming Competitions : విజయవాడ గాంధీనగర్​లో నగరపాలక సంస్థకు చెందిన ఈతకొలను. ఇది ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాలల జాతీయ క్రీడా పోటీల్లో భాగంగా అక్కడ క్రీడాకారులకు అదివారం పోటీలు నిర్వహించాలి. నీరు బాగోలేక పోటీలను వాయిదా వేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • తప్పతాగి.. రోడ్డుపైనే పడి.. కర్నూలులో ఏఎస్సై హల్​చల్​
    ASI Drunk Alcohol: సమాజానికి సందేశం ఇచ్చే పోలీసు.. తప్పతాగి రోడ్డు మీద పడిపోయాడు. ప్రజారక్షణే ధ్యేయంగా విధులు నిర్వహించాల్సిన ఖాకీనే.. కిక్కుతో కాలు కదలక తూలుతూ కింద పడిపోయాడు. ఇది చూసిన స్ధానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడంటే..! పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పరిహారం సొమ్ములో లంచం తీసుకునే దౌర్భాగ్యం నాకు లేదు: మంత్రి అంబటి
    Minister Ambati Rambabu comments: పరిహారం సొమ్ము విషయంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ప్రభుత్వం మంజూరు చేసిన పరిహారం సొమ్ము నుంచి లంచం తీసుకునే దౌర్భాగ్యం తనకు లేదని వ్యాఖ్యానించారు. 5 లక్షల రూపాయల పరిహారం మంజూరు చేయించింది తానేనని,.. అలాంటిది శవాలపై పేలాలు ఏరుకోవాల్సిన అవసరం తనకు లేదని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • వచ్చే నెల నడ్డా పదవీకాలం ముగింపు.. అధ్యక్ష పదవిపై భాజపా కీలక నిర్ణయం!
    భాజపా అధ్యక్షునిగా జేపీ నడ్డా పదవీ కాలం వచ్చే నెలతో పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో భాజపా అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుందని తెలిసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కేజ్రీవాల్​కు ఎల్​జీ మరో షాక్.. రూ.97కోట్లు కట్టాలని ఆదేశం.. ఎందుకంటే?
    ప్రభుత్వ ప్రకటనలను పార్టీ ప్రయోజనాలకు వినియోగించారని పేర్కొంటూ.. వాటికి సంబంధించి రూ.97 కోట్లు చెల్లించాలని దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా.. ఆమ్‌ ఆద్మీ పార్టీని ఆదేశించారు. అయితే, ఎల్‌జీకి ఈ అధికారం లేదని ఆప్‌ ఖండించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • గూగుల్​లో కొత్త ఫీచర్​.. ఇకపై డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ను చదివేయొచ్చు
    Google New Feature : డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ సులువుగా అర్థం చేసుకునేందుకు వీలుగా గూగుల్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం కొద్దిమంది యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలో సాధారణ యూజర్లకు సైతం పరిచయం చేయనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • IFSC, MICR అంటే ఏంటి? వాటి వల్ల ఉపయోగాలు తెలుసా?
    సాధారణంగా బ్యాంకుల ద్వారా ఆర్థిక లావాదేవీలు జరిపినప్పుడు ఐఎఫ్‌ఎస్‌సీ, ఎంఐసీఆర్‌ కోడ్‌ల గురించి వింటుంటారు. ముఖ్యంగా డిజిటల్‌ లావాదేవీలు, నెఫ్ట్‌, ఆర్‌టీజీఎస్‌ వంటి ఎలక్ట్రానిక్‌ లావాదేవీల్లో ఐఎఫ్ఎస్​సీ కోడ్ అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో ఐఎఫ్ఎస్​సీ కోడ్​ గురించి తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మెస్సీపై ఫ్రాన్స్​ ఫ్యాన్స్​ ఫైర్​.. ఆ గోల్​ విషయంలో మోసం చేశాడంటూ..!
    ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో మెస్సీ చేసిన రెండో గోల్‌ వివాదాస్పదంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆ గోల్‌ను రెఫరీ అనుమతించడంపై ఫ్రాన్స్‌ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • దిగ్గజ నటుడి కుమార్తె హఠాన్మరణం.. సినీ పరిశ్రమలో విషాదం
    నాటి తరం అందాల నటుడు హరనాథ్​ కూతురు, ప్రముఖ నిర్మాత జి.వి.జి.రాజు భార్య పద్మజా రాజు మంగళవారం మధ్యాహ్నం గుండెపోటుతో కన్నుమూశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details