ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 12, 2022, 4:59 PM IST

ETV Bharat / state

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 5 PM

.

AP TOP NEWS
AP TOP NEWS

  • ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు.. తేల్చిచెప్పిన కేంద్రం:
    NO SPECIAL STATUS FOR AP : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా అంశం ప్రసుత్తం ఉనికిలోనే లేదని తేల్చి చెప్పింది. రాజ్యసభలో వైసీపీ ఎంపీ సుభాష్‌చంద్ర బోస్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. వివిధ కారణాలు, ప్రత్యేక పరిస్థితుల రీత్యా గతంలో జాతీయ అభివృద్ధి మండలి కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించిందని ఆయన తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మాండౌస్​ ముప్పు.. అతలాకుతలమైన రాష్ట్రం.. నేలరాలిన పంటలు
    RAINS IN ANDHRA PRADESH : మాండౌస్​ తుపాన్​ ప్రభావంతో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఉద్యానవన పంటలు నేలరాలడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. కొన్ని ప్రదేశాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వారం రోజుల్లో పంట నష్టం అంచనా వేయాలి: సీఎం జగన్​
    Cm Video Conference On Rains: తుపాను కారణంగా ఏర్పడిన వర్షాలపై సీఎం జగన్​ జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా నిర్వహించిన ఈ సమీక్ష సమావేశంలో.. పంట నష్టాలు, వరదల వల్ల ఏర్పడిన నష్టాలపై సమీక్షించారు. వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని అధికారులకు సూచించారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • బీఆర్​ఎస్​కు మద్దతివ్వాలని అడిగితే ఏం చేయాలనేది ఆలోచిస్తాం: సజ్జల
    SAJJALA ON BRS: బీఆర్​ఎస్​పై తమ అభిప్రాయం తమకుందని.. కేసీఆర్​ మద్దతివ్వాలని అడిగితే ఏం చేయాలనేది ఆలోచిస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల అన్నారు. ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుని అధికారంలోకి వచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • దేశంలో రూ.2వేల నోట్లను దశల వారీగా రద్దు చేయాల్సిందే!: భాజపా ఎంపీ
    దేశంలో రూ.2000 నోట్లను దశలవారీగా రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు రాజ్యసభ భాజపా ఎంపీ సుశీల్​ మోదీ. డ్రగ్స్ వంటి అక్రమ వ్యాపారాల్లో రూ.2000 నోట్లను తరచుగా ఉపయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రెండు కార్లు ఢీ.. ఐదుగురు దుర్మరణం.. టూరిస్ట్​ బస్సు ప్రమాదంలో మరో 35 మంది..
    ఎదురెదురుగా వస్తున్న ఇన్నోవా, స్విఫ్ట్ కార్లు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరోవైపు, టూరిస్ట్ బస్సును లారీని ఢీకొట్టిన ఘటనలో ఒకరు మరణించగా.. మరో 35 మంది గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • గుజరాత్​ సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణం.. మోదీ, షా హాజరు
    Bhupendra Patel Oath : గుజరాత్ ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి భూపేంద్రపటేల్‌ ప్రమాణ స్వీకారం చేశారు. భూపేంద్ర పటేల్‌ పటేల్‌తో పాటు పలువురు మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ, పలువురు కేంద్రమంత్రులు, భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • డబ్బు విషయంలో ఈ భయాలున్నాయా? అయితే ఇది మీ కోసమే!
    Money Fears : మనలో చాలా మంది డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో వెనకాడుతుంటాం. దీనికి అనేక కారణాలు ఉంటాయి. అవేంటి.. వాటిని ఎలా అధిగమించాలో చూద్దామా? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • యూవీ ఆడిన ఐదు బెస్ట్​ ఇన్నింగ్స్​ ఇవే
    కెరీర్​లో ఎన్నో ఘనతలు, రికార్డులు అందుకున్న టీమ్​ఇండియా మాజీ ఆల్​రౌండర్​ యువరాజ్ సింగ్​ ఆడిన ఐదు బెస్ట్ ఇన్నింగ్స్​ను ఓ సారి నెమరువేసుకుందాం..పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మెగాఫ్యాన్స్​కు గుడ్​ న్యూస్​.. తల్లిదండ్రులు కాబోతున్న రామ్​చరణ్​-ఉపాసన
    ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మెగాఅభిమానులకు శుభవార్త. రామచరణ్‌ తండ్రి కాబోతున్నారు. ఈ విషయాన్ని సోషల్​మీడియాలో ట్వీట్​ చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు మెగాస్టార్ చిరంజీవి. "హనుమాన్​ జి ఆశిస్సులతో ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. రామ్​చరణ్​ ఉపాసన త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. ప్రేమతో సురేఖ-చిరంజీవి, శోభన-అనిల్​ కామినేని" అని రాసుకొచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details