- కొనసాగుతున్న మాండౌస్ తీవ్రత.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
MANDOUS CYCLONE IN AP : ఆగ్నేయ బంగాళాఖాతంలో మాండౌస్ ప్రభావం తీవ్రంగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం మహాబలిపురానికి 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు పేర్కొంది.అర్ధరాత్రి తర్వాత మహాబలిపురం-పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ భావిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ముస్లింలకు ఆ పథకాలు టీడీపీ అమలు చేస్తే.. వైసీపీ రద్దు చేసింది: చంద్రబాబు
CHANDRABABU FIRES ON YCP GOVERNMENT : ముస్లింలకు రంజాన్ తోఫా, వివాహాలకు దుల్హన్ ద్వారా ఆర్థికసాయం చేసినది టీడీపీ ప్రభుత్వమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా పొన్నూరులో మైనార్టీల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వారాహి రంగు వివాదం.. నిబంధనలన్నీ ఒక్క నా కోసమేనా: పవన్
PAWAN COUNTER TO YCP LEADER PERNI NANI : వారాహి వాహనానికి నిషేధిత రంగులు వేస్తున్నారంటూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా వైసీపీ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నిబంధనలన్నీ ఒక్క పవన్‌కల్యాణ్ కోసమేనా అని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆ నెలల్లో జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారు..!: సత్యకుమార్
BJP SATYAKUMAR ON EARLY ELECTIONS : వైసీపీ పూర్తి కాలం అధికారంలో ఉంటే ప్రజల్లో వ్యతిరేకత మరింత పెరుగుతుందని తెలిసే.. ముందస్తు వ్యూహానికి సీఎం జగన్ పావులు కదుపుతున్నారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తెలిపారు. వచ్చే ఏప్రిల్, మే నెలల్లోనే జగన్ ముందస్తు ఎన్నికలు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రాజ్యసభ ముందుకు ఉమ్మడి పౌరస్మృతి బిల్లు.. విపక్షాల నిరసనల మధ్యే..
ఎగువసభలో భాజపా సభ్యుడు కిరోడి లాల్.. ఉమ్మడి పౌర స్మృతి 2020 బిల్లును ప్రైవేటుగా ప్రవేశపెట్టారు. బిల్లును అనుమతించాలా లేదా అనే విషయంపై ఓటింగ్‌లో 63 మంది సభ్యులు అనుకూలంగా ఓటేయగా.. 23 మంది వ్యతిరేకించారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'అఫ్తాబ్‌ను ఉరి తీయాలి.. కుటుంబ సభ్యులనూ ప్రశ్నించాలి'.. శ్రద్ధ తండ్రి డిమాండ్
అఫ్తాబ్ పూనావాలకు మరణ శిక్ష విధించాలని దిల్లీలో దారుణ హత్యకు గురైన శ్రద్ధా వాకర్ తండ్రి వికాస్ వాకర్ డిమాండ్ చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ ప్రశ్నించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. తమకు న్యాయం జరుగుతుందని దిల్లీ పోలీసులతో పాటు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ భరోసా ఇచ్చారని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బొగ్గు గనిలో భారీ పేలుడు.. 10 మంది దుర్మరణం
బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- క్రెడిట్ కార్డుపై 'లోన్' తీసుకుంటున్నారా? ఈ విషయాలు మీకోసమే!
అత్యవసరాల్లో డబ్బు అవసరమైనప్పుడు అందుబాటులో ఉన్న మార్గాలన్నీ అన్వేషిస్తుంటాం. ఇలాంటి సందర్భాల్లో చాలామంది వ్యక్తిగత రుణాలు తీసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తుంటారు. కొందరు తమ క్రెడిట్ కార్డు నుంచి రుణం తీసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఎలాంటి పత్రాలు అవసరం లేకుండా సులభంగా లభించే ఈ రుణం గురించి కొన్ని విషయాలు చూద్దామా.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'టీమ్ఇండియా ఐపీఎల్ గురించి ఆలోచించడం మానేయాలి'
బంగ్లాదేశ్‌తో సిరీస్ నేపథ్యంలో భారత ఆటగాళ్లపై పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా విమర్శలు గుప్పించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఇలాంటివి ఎన్నో చూశా.. అవేమి సినిమాను ఏమీ చేయలేవు: షారుక్ ఖాన్
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ బాలీవుడ్ పరిస్థితి, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై కీలక కామెంట్స్ చేశారు. ఏవీ సినిమా స్థాయిని తగ్గించలేవని అన్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఏపీ ప్రధాన వార్తలు