ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 9 PM

ఏపీ ప్రధాన వార్తలు

TOP NEWS
ఏపీ ప్రధాన వార్తలు

By

Published : Nov 30, 2022, 9:02 PM IST

  • దిల్లీ మద్యం స్కామ్‌ రిమాండ్‌ రిపోర్టులో కల్వకుంట్ల కవిత పేరు
    దిల్లీ మద్యం స్కామ్‌ రిమాండ్‌ రిపోర్టులో కల్వకుంట్ల కవిత పేరు చేర్చినట్లు ఈడీ వెల్లడించింది. అమిత్‌ అరోరా రిమాండ్‌ రిపోర్టులో కవిత పేరును ఈడీ పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పిల్లల చదువులకు పెట్టేది ఖర్చుకాదు.. వారికిచ్చే ఆస్తిగా భావిస్తా: సీఎం జగన్​
    CM JAGAN ON VIDYA DEEVENA : పిల్లల చదువుకు పెట్టే ఖర్చును వ్యయంగా చూడకుండా.. ఆస్తిగా భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జగనన్న విద్యాదీవెన పథకం నిధులను బటన్​ నొక్కి విడుదల చేశారు. జులై- సెప్టెంబర్‌ త్రైమాసికానికి 11 లక్షల 2 వేల మంది విద్యార్థులకు 684 కోట్ల నిధులను నేరుగా వారి తల్లుల ఖాతాల్లోకే జమ చేసినట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వివేకాను చంపినంత సులువుగా.. నన్ను, లోకేశ్​ను చంపాలని చూస్తున్నారు: చంద్రబాబు
    CBN FIRES ON CM: సొంత బాబాయిని చంపిన వ్యక్తికి రాష్ట్రాన్ని పాలించే హక్కు ఉందా అని చంద్రబాబు.. సీఎం జగన్‌పై ధ్వజమెత్తారు. వివేకా హత్య కేసు పక్క రాష్ట్రానికి బదిలీ కావడం జగన్‌కు చెంపదెబ్బ లాంటిదన్నారు. తనను చంపుతానని బెదిరించడంపై స్పందించిన చంద్రబాబు.. బాబాయ్‌ని చంపినంత తేలిక కాదని ఎద్దేవా చేశారు. 2024లో వైకాపాను గెలిపిస్తే.. రాష్ట్రానికి, ప్రజలకు అవే చివరి ఎన్నికలని జోస్యం చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • జనసేనతోనే బీజేపీ పొత్తు.. ఆయనతోనే ముందుకెళ్తాం: మురళీధరన్​
    MURALEEDHARAN ABOUT ALLIANCE WITH JANASENA : వచ్చే ఎన్నికల్లో జనసేనతోనే బీజేపీ పొత్తు ఉంటుందని విదేశీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్ అన్నారు. పవన్​తోనే ముందుకెళ్తామని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'గుజరాత్​లో ఈసారీ అధికారం మాదే.. ఆమ్ ఆద్మీకి 'గుండు సున్నా''
    గుజరాత్​లో ఈసారి కూడా భాజపానే విజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి అమిత్​ షా ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో ఆప్​ ఒక్క స్థానంలో కూడా గెలుపొందే అవకాశం లేదని చెప్పారు. గుజరాత్ ఎన్నికల మేనిఫెస్టోలో భాజపా ప్రకటించిన యాంటీ రాడికలైజేషన్​ సెల్​ ఏర్పాటు హామీని దేశవ్యాప్తంగా అమలు చేయాలని పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 89 స్థానాలు.. 788 మంది అభ్యర్థులు.. గుజరాత్​ తొలి దశ పోలింగ్​కు సర్వం సిద్ధం
    Gujarat Elections 2022 : హోరాహోరీగా సాగిన గుజరాత్​ ఎన్నికల ప్రచారం మంగళవారంతో ముగియగా.. గురువారం ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమై​.. సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. తొలిదశలో 89 స్థానాలకు మొత్తం 788 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ కన్నుమూత
    చైనా మాజీ అధినేత జియాంగ్ జెమిన్ తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని చైనా పార్లమెంటు, సైన్యం ధ్రువీకరించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 2022-23 క్యూ2లో జీడీపీ వృద్ధి రేటు 6.3%
    2022-23 జులై-సెప్టెంబర్​ త్రైమాసికంలో భారత దేశ ఆర్థిక వ్యవస్థ 6.3శాతం మేర వృద్ధి చెందింది. జాతీయ గణాంకాల కార్యాలయం ఈమేరకు వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో వృద్ధి రేటు 8.4శాతంగా నమోదైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ విడుదల.. దూసుకొచ్చిన శ్రేయస్​ అయ్యర్​, గిల్​
    టీమ్‌ఇండియా యంగ్ ప్లేయర్స్​ శ్రేయస్‌ అయ్యర్‌, శుభ్‌మన్‌ గిల్‌ మరో ఘనత సాధించారు. వన్డే ర్యాంకింగ్స్‌లో ఈ బ్యాటర్లు తమ స్థానాన్ని మెరుగుపరుచుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆస్కార్‌కు ముందు RRRకు ఇంటర్నేషనల్ అవార్డులు.. దర్శకుడిగా రాజమౌళికి..
    పాన్​ఇండియా మూవీగా తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు అవార్డుల్లోనూ సత్తా చాటుతోంది. ఆస్కార్ అవార్డులకు ముందు ఈ సినిమా సన్‌సెట్ సర్కిల్ అవార్డ్స్‌లో రెండు సొంతం చేసుకుంది. ఆ సంగతులు.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details