Secretariat Employees Union Election Notification: ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ నెలాఖరుతో ఏపీ సచివాలయ అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి ఇతర సభ్యుల పదవీకాలం ముగియనుండటంతో ఎన్నికల నిర్వహించాలని నిర్ణయించారు. నిన్న జరిగిన సచివాలయ ఉద్యోగుల సంఘం ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కొత్త పాలక కమిటీ ఎన్నిక కోసం 12 తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ చేపట్టనున్నట్టు ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం కార్యదర్శి ఎన్. ప్రసాద్ వెల్లడించారు. డిసెంబరు 21 తేదీన ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల నిర్వహణాధికారిగా హోంశాఖలోని డిప్యూటీ కార్యదర్శి కె.వి.కిషోర్ కుమార్ సహా ఇతర అధికారులు నియమితులయ్యారు.
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల... - ఏపీ సచివాలయం నోటిఫికేషన్ వివరాలు
AP Secretariat Employees Union: ఏపీ సచివాలయ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డితో పాటుగా ఇతర సభ్యుల పదవికాలం ముగియడంతో... సచివాలయ ఉద్యోగ సంఘాల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. కొత్త పాలక కమిటీ ఎన్నిక కోసం 12 తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ చేపట్టనున్నారు. డిసెంబరు 21 తేదీన ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికలు జరుగనున్నట్లు అధికారులు తెలిపారు.
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం