ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రైవేట్ ట్రావెల్​​ బస్సుల్లో అధిక చార్జీలు వసూలు చేస్తే.. చర్యలే'

RTA COMMISSIONER ORDERS FOR PRIVATE TRAVELS: సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తే ప్రైవేట్​ బస్సులను సీజ్ చేయడం సహా కేసులు నమోదు చేస్తామని రవాణా శాఖ హెచ్చరించింది. నిబంధనలకు విరుద్దంగా ప్రయాణికులను తరలించడం సహా అధిక చార్జీలు వసూలు చేసే వారిని పట్టుకునేందుకు నేటి నుంచి పండుగ సీజన్ ముగిసేవరకు రాష్ట్రవ్యాప్తంగా దాడులు నిర్వహించాలని నిర్ణయించింది.

private travels
private travels

By

Published : Jan 9, 2023, 8:42 PM IST

RTA COMMISSIONER ORDERS FOR PRIVATE TRAVELS: సంక్రాంతి సందర్భంగా దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని రవాణాశాఖ కమిషనర్ పీఎస్ఆర్ ఆంజనేయులు అన్ని జిల్లాల డీటీసీలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు రవాణా శాఖ సంయుక్త కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. కాంట్రాక్ట్ క్యారేజీ బస్సులు స్టేజీ క్యారేజీగా తిప్పడం నేరమని, ఆన్ లైన్​లో ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. కేసు తీవ్రతను బట్టి కేసులు నమోదు చేసి ట్రావెల్స్​పై ప్రాసిక్యూషన్ చేస్తామని హెచ్చరించారు.

హైదరాబాద్ సహా ఇతర రాష్ట్రాలకు ఎక్కువ మంది రాకపోకలు చేయనున్న దృష్ట్యా సరిహద్దుల్లోని చెక్​పోస్టు వద్ద తనిఖీల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఫిట్​నెస్ లేకుండా సరైన ధ్రువపత్రాలు లేకుండా, కండిషన్ లేని బస్సులు నడిపితే సీజ్ చేస్తామని తెలిపారు. ఇంటర్నెట్​లో ప్రైవేట్ ట్రావెల్స్ వసూలు చేసే ఛార్జీల వివరాలూ, ఆధారాలు తీసుకుని కేసులు రాస్తామని చెప్పారు. ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తే ప్రయాణికులు రవాణా శాఖకు ఫిర్యాదు చేసేందుకు రవాణాశాఖ వెబ్​సైట్లో అధికారుల ఫోన్ నెంబర్లను పొందుపరిచామని.. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రయాణికులు సురక్షితమైన ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details