AP Professionals Forum Meeting in Vijayawada :కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం తీసుకున్న అప్పులకు లెక్కలు చెప్పాలని ఏపీ ప్రొఫెషనల్స్ ఫోరం డిమాండ్ చేసింది. ఏపీ ప్రొఫెషనల్స్ ఫోరం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక అరాచకం రాజ్యమేలుతుందా?అనే అంశంపై విజయవాడలోని ఓ హోటల్లో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు కాగ్ నివేదికలో కూడా తెలిందని నేతలు ఆరోపించారు. కార్పొరేషన్ల ద్వారా లక్షల కోట్లు అప్పు తెచ్చి వాటికి అకౌంట్స్ ఇవ్వకపోవటంపై న్యాయపోరాటం చేస్తామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆర్థిక అవకతవకలపై కేంద్ర సంస్థలు జోక్యం చేకుకోవాలని డిమాండ్ చేశారు.
వామ్మో పది లక్షల కోట్లా! - ఏపీలోకి అడుగు పెట్టాలంటేనే భయపడేలా రాష్ట్ర అప్పులు
Debts in YCP Government : ఏపీ ప్రొఫెషనల్ ఫోరం కన్వీనర్ నేతి మహేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్రంలో కొందరు ఐఏఎస్ అధికారులు రాజ్యాంగ విరుద్ధంగా కార్పోరేషన్ల పేరుతో అప్పులు తెస్తున్నారని మండిపడ్డారు .దీనిపై కోర్టులో పిల్(PIL) వేసి న్యాయపోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక అరాచకం రాజ్యమేలుతుందా? అనే అంశంపై విజయవాడ హోటల్లో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, సీసీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో పాటు పలు పార్టీల నేతలు, ప్రజాసంఘాల నేతలు హజరయ్యారు. కార్పొరేషన్ల ద్వారా రూ. 3.40 లక్షల కోట్ల అప్పును వైసీపీ ప్రభుత్వం తీసుకుందన్నారు.
All Party Round Table Meeting : ఈ అప్పులను బడ్జెట్లో పెట్టకుండా, అసెంబ్లీలో చర్చ జరపకుండా తెచ్చారని ఆరోపించారు. బిల్లులు చెల్లింపులు సక్రమంగా జరకపోవటంతో కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటామని పలు సార్లు హెచ్చరించారని గుర్తు చేశారు. దీనిపై కేంద్రప్రభుత్వం విచారణ జరపాలని కోరారు. పలు కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాల అకౌంట్స్‌ను ప్రభుత్వం ఇవ్వకపోవటం రాజ్యాంగా విరుద్ధమని అన్నారు. ఆర్ధిక అరాచక పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఆరోపించారు.