Minister Peddireddy Presentation On Sand Mining: ఆంధ్రప్రదేశ్‌లో గతకొన్ని రోజులుగా ఇసుక అక్రమ తవ్వకాలపై ప్రజలు, ప్రతిపక్షాలు నిరసనలు, ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇసుక తవ్వకాలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి.. వివరణ ఇవ్వాలంటూ 'ఇసుక సత్యాగ్రహం' పేరుతో టీడీపీ నేతలు మూడు రోజులపాటు ఆందోళనలు చేపట్టారు. ఇసుక తవ్వకాలు జరిపే బాధ్యతను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం.. జేపీ పవర్ వెంచర్స్ అప్పగించడంతో అధికార పార్టీ నేతలు ఇష్టానుసారంగా ఇసుక తవ్వి, అమ్మేస్తున్నారని విమర్శించారు. జేపీ సంస్థ ముసుగులో ఇసుక వ్యాపారమంతా అధికార పార్టీ నాయకులే నిర్వహిస్తున్నారంటూ.. టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇసుక తవ్వకాలపై గురువారం రాష్ట్ర గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజంటేషన్ ఇచ్చారు.
Minister Peddareddy Comments:మంత్రి పెద్దారెడ్డి మాట్లాడుతూ..''రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు ఎవరు చేసుకున్నా ప్రభుత్వానికి ఇబ్బందేమీ లేదు. రాష్ట్ర ఖజానాకు ఆదాయం జమ అయ్యిందా..? లేదా..? అన్నదే ముఖ్యం. ప్రస్తుతం ఏపీలో జేపీ వెంచర్స్ సంస్థే ఇసుక తవ్వకాలు జరుపుతోంది. ఇప్పటి వరకూ రూ.6.7 కోట్ల టన్నుల ఇసుక తవ్వకాలు జరిపితే.. ప్రభుత్వానికి 2,300 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఇసుక తవ్వకాల కాంట్రాక్టును జేపీ వెంచర్స్ సంస్థకు ఇచ్చాం. జేపీ వెంచర్స్ సంస్థ ఇసుక తవ్వకాల విషయంలో సబ్ కాంట్రాక్ట్ ఎవరికిచ్చినా.. అది మా ప్రభుత్వానికి సంబంధం లేదు.'' అని అన్నారు.
TDP Sand Satyagraham Protest: టీడీపీ ‘ఇసుక సత్యాగ్రహం’.. ముఖ్య నేతలు గృహ నిర్బంధం
Peddireddy Comments On Chandrababu: చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆయన ఇంటి వెనుక ఇసుక దోపిడీ జరిగిందని.. మంత్రి పెద్దిరెడ్డి ఆక్షేపించారు. డ్వాక్రా మహిళల పేరు చెప్పి, ఇసుకను దోచుకున్న వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. పారదర్శకంగానే జేపీ వెంచర్స్‌కు ఇసుక కాంట్రాక్ట్‌ను అప్పగించామన్నారు. ప్రస్తుతం ఏడాదికి ఇసుక ద్వారా రూ.765 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వస్తోందని.. మంత్రి పెద్దిరెడ్డి వివరాలు వెల్లడించారు.