AP Inter Results :ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఫలితాలు బుధవారం విడుదల చేయనున్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి శేషగిరిరావు తెలిపారు. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో సాయంత్రం 5గంటలకు ఇంటర్ ఫలితాలను విడుదల చేస్తారని ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీలో ఇంటర్ వార్షిక పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి మొత్తం రెగ్యులర్ విద్యార్థులు 9లక్షల 20వేల 552 మంది, ఒకేషనల్ విద్యార్థులు 83వేల749 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఏపీ ఇంటర్ ఫలితాలను bie.ap.gov.in వెబ్‌సైట్‌తో పాటు eenadu.net, eenaduprathibha.netలలో తెలుసుకోవచ్చు.
Inter Results రేపే ఇంటర్ ఫలితాలు - మంత్రి బొత్స సత్యనారాయణ
AP Inter Results :రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపారు. ఫలితాలను విజయవాడలో బుధవారం సాయంత్రం 5 గంటలకు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేస్తారని వెల్లడించారు.
Inter Results