ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

High Court: జగన్ సర్కార్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ.. ఆ నోటీసులు సస్పెండ్..? - tdp news

AP High Court suspends government notice: వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్ అసోసియేషన్‌ను ఎందుకు రద్దు చేయకూడదంటూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటీసులను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సస్పెండ్ చేసింది. ఆ శాఖ (వాణిజ్య పన్నుల శాఖ) బదిలీల్లో జరిగిన అక్రమాలను ప్రశ్నించడం, నిరసన తెలియజేయడాన్ని సాకుగా చూపుతూ ప్రభుత్వం ఇచ్చిన నోటీసులపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది.

AP High Court
AP High Court

By

Published : May 1, 2023, 4:01 PM IST

Updated : May 1, 2023, 7:31 PM IST

AP High Court suspends government notice: ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్ సంఘాన్ని ఎందుకు రద్దు చేయకూడదంటూ.. గత సంవత్సరం వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన నోటీసులను.. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు) సస్పెండ్ చేసింది. ఆ సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో భాగంగా వాణిజ్య పన్నుల శాఖ బదిలీల్లో జరిగిన అక్రమాలను ప్రశ్నించడం, నిరసన తెలియజేయడాన్ని సాకుగా చూపుతూ.. ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందని.. సూర్యనారాయణ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. అంతేకాకుండా, సకాలంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవడం, పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడంపై సుర్యనారాయణ నేతృత్వంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం..ఆనాటి గవర్నర్‌ను కలిసి ఏర్యాదు చేస్తే.. ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడిందని న్యాయవాది పేర్కొన్నారు.

వివరాల్లోకి వెళ్తే.. 2022వ సంవత్సరం డిసెంబర్ 31వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించి.. ఉద్యోగులు క్రమశిక్షణ నిబంధనలను ఉల్లంఘించినందున ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ ఏపీ కమర్షియల్‌ టాక్స్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌కు.. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఇంఛార్జి ప్రధాన కమిషనర్‌ ఎన్‌.గుల్జార్‌ సంజాయిషీ నోటీసు జారీ చేశారు. ఆ నోటీసులో మరోసారి ఇలా జరిగితే.. సంఘం గుర్తింపును రద్దు చేయడమే కాకుండా, పోలీసుల దృష్టికి కూడా తీసుకుపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ క్రమంలో ప్రభుత్వం జారీ చేసిన ఆ నోటీసులపై కేఆర్ సూర్యనారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటీసులపై ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా సూర్యనారాయణ తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి పలు కీలక అంశాలను తీసుకువచ్చారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో జీతాలు ఇవ్వకపోవడం, పెండింగ్ బకాయిలను చెల్లించకపోవడంతో అసోషియేషన్ నాయకులు అప్పటి రాష్ట్ర గవర్నర్‌ను కలిసి.. ఏపీజీఈ ఏ తరపున సూర్యనారాయణ ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన నేతృత్వంలోని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదంటూ అప్పట్లో ప్రభుత్వం నోటీసులు జారీ చేసిందని న్యాయవాదులు తెలిపారు. ఆ అంశంపై సూర్యనారాయణ హైకోర్టుకు వెళ్లి, స్టే తెచ్చుకున్నారని ధర్మాసనానికి తెలిపారు. ఆ తర్వాత కూడా సూర్యనారాయణపై కక్ష కొనసాగింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని వివరించారు.

అంతేకాకుండా, గతేడాది డిసెంబర్ నెలలో వాణిజ్య శాఖలో బదిలీల పారదర్శకతపై కమిటీ నిర్ణయాన్ని చెప్పాలని ఉన్నతాధికారి కార్యాలయంలో కొందరు ఉద్యోగస్తులు నిరసన వ్యక్తం చేశారు. ఆ సంఘటనకు సంబంధించి వాణిజ్య పన్నుల శాఖ గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదు అంటూ ఏప్రిల్‌లో నోటీసులు ఇవ్వటం సరికాదని వాదించారు. సూర్యనారాయణ నేతగా ఉన్న ఉద్యోగ సంఘాలను రద్దు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పిటిషనర్ తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. సూర్యనారాయణను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలిపారు. దీంతో న్యాయవాది వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం.. ప్రభుత్వం జారీ చేసిన నోటీసును సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఇవీ చదవండి

Last Updated : May 1, 2023, 7:31 PM IST

ABOUT THE AUTHOR

...view details