AP High Court Suo Moto PIL Against Public Representatives Cases :ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులలో విచారణను సుప్రీకోర్టు వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో విచారణను వేగం పెంచేందుకు ఏపీ హైకోర్టు చర్యలు మొదలు పెట్టింది.
AP HC Measures to Speed Up Cases MPs and MLAs : ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులలో విచారణలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ జాప్యాన్ని నివారించే నిమిత్తం సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఏపీ హైకోర్టు కీలక చర్యలు ప్రారంభించింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు సుమోటోగా ప్రజాహిత వ్యాజ్యాన్ని నమోదు చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డీజీపీ, హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసులను విచారించే ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ప్రత్యేక కోర్టును వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొంది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్ ఎం.కిరణ్మయితో కూడిన ధర్మాసనం పిల్‌పై విచారణ జరిపింది. ఈ పిల్‌పై విచారణను సాగించేందుకు అడ్వొకేట్ జనరల్(ఏజీ) హాజరు తప్పనిసరి అని ధర్మాసనం తెలిపింది. ఏజీ అందుబాటులో లేరని, లేరని ప్రత్యేక పీపీ వివేకానంద బదులు ఇచ్చారు. సోమవారం అందుబాటులోకి వస్తారని అన్నారు. విచారణను వాయిదా వేయాలని కోరారు.
ప్రజాప్రతినిధుల కేసులపై సుప్రీంకోర్టు తీర్పు - సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్‌తో ముఖాముఖి
Supreme Court on Public Representatives Cases : ధర్మాసనం స్పందిస్తూ, సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రజాప్రతినిధులపై కేసులను విచారించే సంబంధిత కోర్టుకు తగిన ఆదేశాలు ఇవ్వాల్సి ఉందని తెలిపింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తదితరప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల విచారణలలో జాప్యాన్ని నివారించేందుకు సుప్రీంకోర్టు 2023 నవంబర్ 09న పలు మార్గదర్శకాలు జారీ చేసింది. కేసులను పర్యవేక్షించేందుకు హైకోర్టుల్లో ప్రత్యేక ధర్మాసనాలను ఏర్పాటు చేయాలని పేర్కొంది. ట్రయల్ కోర్టులు తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప విచారణలను వాయిదా వేయకూడదని స్పష్టం చేసింది.