ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

AP High Court on Bandaru Satyanarayana Case: 41ఏ నోటీసులు తీసుకోకపోతే వెంటనే ఎలా అరెస్ట్ చేస్తారు..? : హైకోర్టు

AP High Court on Bandaru Satyanarayana Case: టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అరెస్టు పరిణామాలపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో భాగంగా ప్రభుత్వ న్యాయవాదిపై న్యాయస్థానం ప్రశ్నల వర్షం కురిపించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించలేదని తేలితే, దర్యాప్తు అధికారిపై సుమోటోగా చర్యలు తీసుకుంటామని కోర్టు వెల్లడించింది.

High_Court_on_Bandaru_Satyanarayana_Case
High_Court_on_Bandaru_Satyanarayana_Case

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 5, 2023, 10:59 PM IST

AP High Court on Bandaru Satyanarayana Case:తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని అక్రమ నిర్బంధంలో ఉంచారని.. దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై గురువారం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు)లో విచారణ చేసింది. విచారణలో భాగంగా అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించలేదని తేలితే.. దర్యాప్తు అధికారిపై సుమోటోగా చర్యలు తీసుకుంటామని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దాంతో పోలీసులు 41ఏ నోటీసులు ఇవ్వలేదని చెప్పారని, తాము 41ఏ నోటీసులు ఒరిజినల్ కాపీ ఫైల్ చేశామని పిటిషనర్ న్యాయవాది వి.వి సతీష్‌ వాదనలు వినిపించారు. దీనిపై కౌంటర్ వేస్తామని చెప్పి.. ఎందుకు వెయ్యలేకపోయారని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది.

High Court Fires Government Advocate:అంతేకాకుండా, 41ఏ నోటీసులు తీసుకోకపోతే వెంటనే ఎలా అరెస్ట్ చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. 41ఏ నోటీసులు తీసుకోకపోతే కోర్టుకి తెలిపి.. అనుమతి తీసుకున్న తరువాత అప్పుడు అరెస్ట్ చేయాలి కదా అని న్యాయస్థానం నిలదీసింది. రిమాండ్ ఉత్తర్వులను కూడా వచ్చే వాయిదా నాటికి కోర్టుకు అందించాలని పోలీసుల తరపు న్యాయవాదిని ఆదేశించింది. దీంతో కౌంటర్ వేసేందుకు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను వచ్చే గురువారానికి కోర్టు వాయిదా వేసింది.

Bail to Bandaru Satyanarayana: బండారు సత్యనారాయణకు బెయిల్ మంజూరు

Mobel Court Granted Bail to Bandari: ఇక, బండారు సత్యనారాయణ కేసు విషయానికొస్తే.. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజాను బండారు దూషించారని వైఎస్సార్సీపీ నేతలు నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మూడు రోజులక్రితం అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెంలోని తన నివాసంలో ఆయనకు 41ఏ, 41బీ నోటీసులు ఇచ్చిన అరెస్ట్ చేశారు. అనంతరం బండారును మొబైల్‌ కోర్టులో హాజరుపర్చగా.. రూ.25 వేల పూచీకత్తుతో మొబైల్‌ కోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ క్రమంలో బండారును అక్రమ నిర్బంధంలో ఉంచారని దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది.

TDP Leader Bandaru Satyanarayana Murthy ఎన్ని కేసులు పెట్టినా నా పోరాటం ఆగదు..: బండారు సత్యనారాయణమూర్తి

Buddha Venkanna got Relief in The High Court:మరోవైపు గన్నవరం ఆత్కూరు పోలీసులు నమోదు చేసిన కేసులో టీడీపీ నేత బుద్ధా వెంకన్నకు హైకోర్టులో ఊరట లభించింది. వల్లభనేని వంశీ, కొడాలి నానిపై బుద్ధ వెంకన్న అనుచిత వ్యాఖ్యలు చేశారని మాజీమంత్రి పేర్ని నాని ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్కూరు పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ..బుద్ధా వెంకన్న హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఆ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం.. పిటిషనర్‌ను అరెస్ట్ చేయవద్దని, 41ఏ నోటీసు ప్రొసీజర్ అమలు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

TDP Leader Bandaru Satyanarayana Murthy Arrested: బండారు సత్యనారాయణ అరెస్టు.. ముందస్తు గృహనిర్బంధాలు.. స్టేషన్ వద్ద ఆంక్షలు

ABOUT THE AUTHOR

...view details