Letter To Chief Justice Of India : విశాఖ రాజధానిపై ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటనపై.. హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న అంశంపై జగన్మోహన్ రెడ్డి జోక్యం చేసుకోవటం పక్షపాతమని లేఖలో తెలిపారు. రాజధానిని మార్చటానికి, రాజధాని నగరాన్ని విభజించటానికి ఎటువంటి తీర్మానంగానీ, చట్టంగానీ చేయటానికి శాసన సభకు అధికారం లేదని తెలిపారు. సుప్రీంకోర్టు ధిక్కరణ, కోర్టు ధిక్కార చట్టం, 1971 ధిక్కార ప్రక్రియలను నియంత్రించే నిబంధనల ప్రకారం.. జగన్పై సుమోటోగా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.
సీఎంపై సుమోటోగా చర్యలు తీసుకోవాలి: హైకోర్టు న్యాయవాది
Letter To Chief Justice Of India: విశాఖ రాజధానిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల చేసిన ప్రకటన రాష్ట్రంలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ప్రతిపక్షాలు ఈ ప్రకటనపై విమర్శలు చేస్తూనే ఉన్నా.. వైసీపీ నేతలు మాత్రం సమర్థించుకుంటూ వస్తున్నారు. ఈ ప్రకటనపై చర్యలు తీసుకోవాలని.. రాజకీయ నేతలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాయగా.. ప్రస్తుతం హైకోర్టు న్యాయవాది సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు.
Etv Bharat