High Court On Teachers MLC Voters Petition : టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితాలో అనర్హులను చేర్చారంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ను.. ధర్మాసనం విచారణకు చేపట్టింది. ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలోని ఓటర్ల జాబితాలో మార్పులు ఉన్నాయని.. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. దీనిపై ఎలక్షన్ కమిషన్ కౌంటర్ దాఖలు చేసింది. పిటిషన్లో తెలిపిన అభ్యంతరం జాబితాలో సవరణలు చేశామని.. ఎన్నికల సంఘం అధికారులు అఫిడవిట్లో కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితాపై హైకోర్టులో యూటీఎఫ్ పిటిషన్ - ఎన్నికల సంఘం
Teachers MLC Election : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితాలో అనర్హులను చేర్చారని ఏపీ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ఆరోపించింది. యూటీఎఫ్ పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ చేపట్టిన హైకోర్టు తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
ఏపీ హైకోర్టు