High Court On Old Age Homes తల్లిదండ్రులు, వయోవృద్ధుల సంక్షేమం, నిర్వహణ చట్టం ప్రకారం జిల్లాకో వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వ సహాయంతో వృద్ధాశ్రమాల్ని ఎన్జీవోలు నిర్వహిస్తున్నాయనే కారణంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యత నుంచి తప్పించుకోవడానికి వీల్లేదని తెలిపింది. చట్టబద్ధంగా నిర్వహించాల్సిన బాధ్యతను పొరుగుసేవల ద్వారా ఎన్జీవోలకు అప్పగించడం సరికాదని అభిప్రాయపడింది.
వృద్ధాశ్రమాల ఏర్పాటుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు - ఈటీవీ భారత్ వార్తలు
High Court On Old Age Homes ఏపీలో ఆశ్రమాలు ఏర్పాటు చేయలేదని దాఖలైన పిటిషన్ను హైకోర్టు విచారణ చేపట్టింది. ఆశ్రమాల ఏర్పాటు విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని హైకోర్టు ప్రభుత్వాన్ని అదేశించింది.
హైకోర్టు
ప్రతి జిల్లాలో వృద్ధాశ్రమం ఏర్పాటు విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని.. మహిళ, శిశు సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. వయోవృద్ధుల సంక్షేమం, నిర్వహణ చట్టంలోని నిబంధనల ప్రకారం.. ఏపీలో ఆశ్రమాలు ఏర్పాటు చేయలేదని పేర్కొంటూ న్యాయవాది రాపోలు భాస్కర్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది.
ఇవీ చదవండి: