ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

AP High Court Hearing on New Registration System: నూతన ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ విధానంపై హైకోర్టులో విచారణ.. కౌంటర్​ దాఖలు చేయాలని ఆదేశాలు - New Registration System updates

AP High Court Hearing on New Registration System: ఆస్తుల దస్తావేజుల రిజిస్ట్రేషన్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ (కార్డ్‌ ఫ్రైమ్‌ 2.0) విధానంపై దాఖలైనా పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో భాగంగా న్యాయవాదులు వాదనలు విన్న ధర్మాసనం.. రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సీఎస్‌లను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

AP_High_Court_Hearing_on_New_Registration_System
AP_High_Court_Hearing_on_New_Registration_System

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 13, 2023, 4:41 PM IST

AP High Court Hearing on New Registration System: రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 29న ఆస్తుల దస్తావేజుల రిజిస్ట్రేషన్‌ విషయంలో ఆన్‌లైన్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ సులువుగా జరిగేలా ఓ నూతన (కార్డ్‌ ఫ్రైమ్‌ 2.0) విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఆ విధానం ద్వారా అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని, చట్టాలకు వ్యతిరేకంగా రిజిస్ట్రేషన్ నిబంధనలు ఉన్నాయని, ప్రభుత్వం విడుదల చేసిన జీవోని వెంటనే కొట్టి వేయాలంటూ.. కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన కొత్తపల్లి శివరాం ప్రసాద్ అనే వ్యక్తి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు)లో పిటిషన్‌ వేశారు. ఆ పిటిషన్‌పై బుధవారం న్యాయస్థానంలో విచారణ జరిగింది.

Advocate Jada Shravan Kumar Arguments in the High Court:విచారణలో భాగంగా పిటిషనర్ తరుఫు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ హైకోర్టులో వాదనలు వినిపించారు. భారతీయ సాక్షి చట్టంలో నిర్దేశించిన విధంగా సాక్షులు లేని దస్తావేజులు చెల్లనివిగా పరిగణించబడతాయన్నారు. ఈ నూతన రిజిస్ట్రేషన్ విధానంలో అటువంటి అవకాశం లేనందున.. ప్రభుత్వం ఇచ్చిన జీవోని కొట్టి వేయాలని న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేశారు. అనుభవం లేని వార్డు సెక్రటరీల ద్వారా ఈ రిజిస్ట్రేషన్ విధానాన్ని అమలుపర్చడం ద్వారా కొన్ని లక్షల మంది ఆస్తుల రిజిస్ట్రేషన్‌పై తీవ్ర ప్రభావం పడుతుందని న్యాయవాది శ్రావణ్ కుమార్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

New Problems with Online Registration in AP: కొత్త రిజిస్ట్రేషన్ విధానంతో.. కొత్త అనుమానాలు! సందేహాలను తీర్చాల్సిందేనంటున్న.. కొనుగోలు దారులు

The High Court Adjourned the Hearing.. అనంతరం ప్రజల ఆస్తులకు సంబంధించిన పత్రాలు అందించకుండా కేవలం.. జిరాక్స్ కాపీలు మాత్రమే ఇస్తామంటూ చేసిన ప్రకటన రిజిస్ట్రేషన్ చట్టాలకు వ్యతిరేకమంటూ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో న్యాయవాదుల వాదోపవాదాలు విన్న ధర్మాసనం.. రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సీఎస్‌లను కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను మూడు వారాలకు వాయీదా వేస్తూ..హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

PIL Filed in AP HC on New Registration Policy: ఏపీలో నూతన రిజిస్ట్రేషన్ విధానంపై హైకోర్టులో పిల్ దాఖలు..

Petition in High Court on New Online Registration:వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ (కార్డ్‌ ఫ్రైమ్‌ 2.0) విధానాన్ని సవాలు చేస్తూ.. 9 సెప్టెంబర్ 2023న.. కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన కొత్తపల్లి సీతారామప్రసాద్‌ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఆ వ్యాజ్యంలో.. రిజిస్ట్రేషన్‌ చట్టం, భారత సాక్షి చట్టం నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ నిర్ణయం ఉందని పేర్కొన్నారు. నూతన విధానం అమలు కోసం స్టాంపులు, రిజిస్ట్రేషన్‌శాఖ కమిషనర్‌, ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (ఆగస్టు 29న) ఇచ్చిన సర్క్యులర్‌ను రద్దు చేయాలని కోరారు.

Key Points Mentioned in the Petition ''రెవెన్యూ (రిజిస్ట్రేషన్‌) శాఖ ముఖ్యకార్యదర్శి, పంచాయతీరాజ్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, రిజిస్ట్రేషన్‌, స్టాంపులశాఖ ఐజీ, గ్రామ, వార్డువాలంటీరు, సచివాలయాల డైరెక్టర్‌ తదితరులు ప్రతివాదులుగా ఉన్నారు. స్థిరాస్తులకు సంబంధించిన దస్త్రాలన్నింటినీ సబ్‌రిజిస్ట్రార్‌ వద్ద సమర్పించాలని రిజిస్ట్రేషన్‌ చట్టంలోని సెక్షన్‌ 28 స్పష్టం చేస్తోంది. సెక్షన్‌ 32 ప్రకారం.. ఆస్తులను రిజిస్ట్రేషన్‌ చేసేవారు, చేయించుకునేవారు తప్పనిసరిగా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో హాజరుకావాల్సి ఉంటుంది. నూతనంగా ప్రభుత్వం తీసుకొచ్చిన సాఫ్ట్‌వేర్‌ విధానంలో భౌతికంగా హాజరు పద్ధతి లేదు. ఈ విధానం వల్ల నిరక్షరాస్యులకు తీవ్ర ఇబ్బంది ఉంటుంది. సాఫ్ట్‌వేర్‌ విధానంతో రిజిస్ట్రేషన్లు చేయడం రిజిస్ట్రేషన్‌ చట్టానికి విరుద్ధం. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని రిజిస్ట్రేషన్లు, స్టాంపులశాఖ ఐజీ ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ..న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి.'' అని పిటిషనర్ తన వ్యాజ్యంలో పై విషయాలను పేర్కొన్నారు.

TDP Naseer on New Registration System 'కమీషన్ల కోసమే సీఎం జగన్ నూతన రిజిస్ట్రేషన్ విధానాన్ని తీసుకొచ్చారు.'

ABOUT THE AUTHOR

...view details