AP High Court Hearing on House Arrest Petition of TDP Leaders: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తూ.. నిరసనలు తెలుపుతున్న టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేయడంపై.. వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో భాగంగా పిటిషనర్ తరపు న్యాయవాది వై. బాలాజీ కోర్టులో వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తోందని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు.
Protests Over Illegal Arrest of Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ.. గతకొన్ని రోజులుగా ఆ పార్టీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే, నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న కార్యకర్తలను పోలీసులు అడుగడుగునా అడ్డుకోవడమే కాకుండా, ముఖ్యనేతలను గృహనిర్బంధాలు చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ నేతల గృహనిర్బంధాలపై ఆ పార్టీ నేత, వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తాజాగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు)లో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌పై నేడు న్యాయస్థానంలో విచారణ జరిగింది.
TDP Protests Across Andhra Pradesh: చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా.. 'బబుతో నేను అంటూ' నిరసనలు
Advocate Balaji Arguments:పిటిషనర్ తరపు న్యాయవాది వై.బాలాజీ కోర్టులో వాదనలు వినిపిస్తూ.. టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేయడం చట్టవ్యతిరేకమైన చర్య అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19, 21కి విరుద్ధమన్న న్యాయవాది.. సుప్రీంకోర్టు నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని తెలిపారు. అధికార పార్టీ కార్యక్రమాలకు అనుమతులు ఇస్తూ.. ప్రతిపక్షాలకు అనుమతులను నిరాకరిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.