Accidental Insurance : గుంటూరు జిల్లా అమరావతిలోని మర్కెట్ వద్ద 2005 అక్టోబర్‌లో లాలూనాయక్ అనే వ్యక్తిని ఓ ఆటో అత్యంత వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి అతనిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందాడు. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణామని పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో 2లక్షల రూపాయలు పరిహారం ఇప్పించాలని మృతుడి కుటుంబ సభ్యులు గుంటూరు మొదటి ఏడీజే/ప్రమాద బీమా ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు.
విచారణ జరిపిన ట్రైబ్యునల్ లక్ష 79వేల రూపాయల పరిహారం అందిచాలని బీమా సంస్థ, ఆటో డ్రైవర్‌ను ఆదేశిస్తూ 2007 మే నెలలో ఉత్తర్వులిచ్చింది. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ గుంటూరు డివిజినల్ మేనేజరు 2008లో హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. వాదనలు వినిపించిన బీమా సంస్థ తరఫు న్యాయవాది.. ప్రమాద సమయంలో ఆటో డ్రైవర్ లైట్ మోటార్ నాన్ ట్రాన్స్‌పోర్టు వాహనానికి సంబంధించిన లైసెన్స్ మాత్రమే కలిగి ఉన్నాడని కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా ట్రైబ్యునల్ పరిహారం చెల్లించాలని ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని వాదించారు.